Smartphone: ఫోన్‌లో చిన్న రంధ్రం.. ఎంత పెద్ద పనిచేస్తుందో తెలుసా?

స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు కెమెరాల మధ్యలో, ఫ్లాష్‌ లైట్‌ పక్కన, ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా ఫోన్‌ పైవైపు ఫ్రేమ్‌లో, కింద ఛార్జింగ్‌ పోర్ట్‌ పక్కన చిన్నపాటి రంధ్రం ఉండటం గమనించారా?ఇంతకీ ఆ రంధ్రంతో యూజర్‌కు ఎలాంటి ఉపయోగం?అనేగా మీ సందేహం...

Updated : 13 Aug 2022 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికి అందులో ఫీచర్ల గురించి తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడితే.. మరికొందరు స్మార్ట్‌ఫోన్‌తోనే పనులన్నీ చక్కబెట్టేస్తుంటారు. ఎప్పుడైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు కెమెరాల మధ్యలో, ఫ్లాష్‌ లైట్‌ పక్కన, ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా ఫోన్‌ పైవైపు ఫ్రేమ్‌లో, కింద ఛార్జింగ్‌ పోర్ట్‌ పక్కన చిన్నపాటి రంధ్రం ఉండటం గమనించారా? లేదా? అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. ఇంతకీ ఆ రంధ్రం ఎందుకు? దాంతో యూజర్‌కు ఎలాంటి ఉపయోగం?అనేగా మీ సందేహం. మరింకెందుకు ఆలస్యం.. దాని గురించిన పూర్తి సమాచారంపై ఓ లుక్కేయండి...

స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన తొలినాళ్లలో చాలా మంది ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో ఒకరకమైన శబ్దం వినిపిస్తుందని, దాని వల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాట స్పష్టంగా వినపడటం లేదనే చెప్పేవారు. అదే నాయిస్‌ డిస్ట్రబెన్స్‌. తర్వాతి కాలంలో విడుదలైన మోడల్స్‌లో ఆ సమస్య రాలేదు. దీనికి కారణం ఇప్పుడు మీరు సందేహం వ్యక్తం చేసిన చిన్న రంధ్రం. అవును..ఆ రంధ్రంలో మినీ మైక్రోఫోన్‌ ఉంటుంది. అది నాయిస్‌ క్యాన్సిలేషన్‌ డివైజ్‌గా పనిచేస్తుంది. దానివల్ల ఫోన్‌ చేసినప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా ఒకరి మాటలు మరొకరికి వినిపిస్తాయి. చాలా మంది ఫోన్ లోపలికి ఎయిర్‌ కోసం ఏర్పాటు చేశారని భావిస్తుంటారు. అందండీ.. చిన్న రంధ్రం వెనుకు ఉన్న అసలు విషయం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని