SmartPhones Launch: జూన్‌ నెలలో బడ్జెట్‌, ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌దే హవా.. ఏది ఎప్పుడంటే!

మొబైల్‌ కంపెనీలు యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ విడుదల చేస్తుంటాయి. వాటిలో బడ్జెట్‌, ఫ్లాగ్‌షిప్‌, గేమింగ్ మోడల్స్‌ ఉంటాయి. అలా జూన్‌ నెలలో కొన్ని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వరుసకట్టనున్నాయి. మరి ఆ మోడల్స్‌ జాబితాపై ఓ లుక్కేద్దామా..  

Published : 30 May 2022 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ కంపెనీలు యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తుంటాయి. వాటిలో బడ్జెట్‌, ఫ్లాగ్‌షిప్‌, గేమింగ్ మోడల్స్‌ ఉంటాయి. అలా జూన్‌ నెలలో కొన్ని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వరుసకట్టనున్నాయి. మరి ఆ మోడల్స్‌ జాబితాపై ఓ లుక్కేద్దామా!  


నథింగ్ వన్‌ ( Nothing (1))

ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 778జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. జూన్‌ 9 తేదీ లేదా జూన్‌ 21న విడుదల చేస్తారని తెలుస్తోంది.  


 

షావోమి 12 సిరీస్‌ (Xiaomi 12 X/12T Series)

షావోమి కంపెనీ 12 సిరీస్‌లో కొత్త ఫోన్‌ జూన్‌ చివరి వారంలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ 12 ఎక్స్‌ లేదా 12 టీ పేరుతో మూడు వేరియంట్లలో యూజర్లకు పరిచయం చేయనుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. వెనుక మూడు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 108 ఎంపీ ప్రధాన కెమెరా. 


షావోమి నోట్‌ 11టీ ప్రో/ప్రో+ (Xiaomi Note 11T Pro/Pro+)

144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాట్‌ టెక్‌ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా అమర్చారు. వీటిలో 64 ఎంపీ ప్రధాన కెమెరా. ప్రో వేరియంట్‌లో 4400 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రో+ వేరియంట్‌లో 5,080 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 


పోకో ఎఫ్‌4 జీటీ (Poco F4 GT) 

గేమింగ్ ప్రియుల కోసం పోకో కంపెనీ మరో కొత్త ఫోన్‌ను జూన్‌ నెల మధ్యలో విడుదల చేయనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 లేదా స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, వెనుకవైపు 50 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. దీనితోపాటు పోకో ఎఫ్‌ 4 సాధారణ వేరియంట్, పోకో ఎక్స్‌4 జీటీ మోడల్స్‌ను కూడా విడుదల చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.


వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ (OnePlus Nord 2T)

ఈ ఫోన్‌లో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్‌ సూపర్ వాక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతో మూడు కెమెరాలు అమర్చారు. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.  జూన్‌ మూడు లేదా నాలుగో వారంలో వన్‌ప్లస్‌ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. 


రియల్‌మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3T)

రియల్‌మీ జూన్‌ రెండు లేదా మూడో వారంలో స్పెషల్‌ ఎడిషన్‌ ఫోన్‌ను తీసుకురానుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్‌ 870 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ  డీ8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. 80 వాట్‌ లేదా 150 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ ఉంటుందని సమాచారం. 


గూగుల్ పిక్సెల్‌ 6ఏ (Google Pixel 6a)

కొద్ది రోజుల క్రితం గూగుల్ ఐ/ఓ 2022 (Google I/O) సదస్సులో గూగుల్ పిక్సెల్‌ 6ఏ ఫోన్‌ను విడుదల చేశారు. జూన్‌ నెలలో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. టెన్సర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌ భద్రత కోసం టైటాన్‌ ఎమ్‌2 సెక్యూరిటీ ప్రాసెసర్‌ కూడా ఇస్తున్నారు. పిక్సెల్‌ 6ఏలో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనకువైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఫోన్‌లోని 4,410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్‌ ధర సుమారు ₹ 35,000 ఉంటుందని అంచనా.


 

ఒప్పో కే 10 5జీ/కే10 ప్రో (Oppo K10 5G/K10 Pro)

ఒప్పో కంపెనీ బడ్జెట్‌ ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌లో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. ఒప్పో కే 10 5జీ లేదా కే10 ప్రో పేరుతో ఈ ఫోన్‌ విడుదల చేస్తుందని తెలుస్తోంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.62-అంగుళాల అమోలెడ్  డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. మీడియాటెక్ డైమెన్సిటీ 8000 లేదా స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందట. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. జూన్‌ రెండు లేదా మూడో వారంలో ఈ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేస్తారని సమాచారం. 

దీనితోపాటు ఒప్పో రెనో 8 సిరీస్‌ (Oppo Reno 8 Series)లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారట. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1/మీడియాటెక్ డీ 1300/ మీడియాటెక్‌ డీ 8100 ప్రాసెసర్లను ఉపయోగించినట్లు సమాచారం. జూన్‌ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ఈ ఫోన్లను మార్కెట్లోకి రానున్నాయి. 


మోటో ఈ32ఎస్‌ (Moto e32s)

మోటోరోలా బడ్జెట్ శ్రేణిలో మోటో ఈ32ఎస్‌ మోడల్‌ తీసుకొస్తోంది. దీని ధర ₹ 10 వేలు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 6.5-అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్‌ హీలియో జీ 37 ప్రాసెసర్‌, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 

దీనితోపాటు మోటో జీ82 (Moto G82) మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ కేవలం 175 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారని తెలుస్తోంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందట. 


మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా/ మోటో ఫ్రంటీయర్‌ (Moto Edge 30 Ultra/Moto Frontier)

మోటోరోలా ఫ్లాగ్‌షిప్ శ్రేణిలో కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. 200 ఎంపీ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67-అంగుళాల పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. జూన్‌ రెండు లేదా నాలుగో వారంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. 


రెడ్‌మీ నోట్‌11 ఎస్‌ఈ (Redmi Note11 SE)

రెడ్‌మీ కంపెనీ బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 ఎంపీ కెమెరా, వీడియో కాలింగ్‌, సెల్ఫీల కోసం ముందు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొస్తున్నారు. దీని ధర ₹ 10 వేల నుంచి ₹ 13 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.  

వీటితో పాటు శాంసంగ్ కంపెనీ ఫ్లిప్‌, ఫోల్డ్‌ మోడల్స్‌లో కొత్త ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటి ధర, ఫీచర్ల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని