Smartphones: ఈ వారంలో రిలీజ్ అయ్యే స్మార్ట్ఫోన్లు ఏవో తెలుసా?
స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునే మరిన్ని మోడల్స్ రాబోతున్నాయి. ఈ వారంలోనే ఆయా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లలో అడుగుపెట్టనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునే మరిన్ని మోడళ్లు రాబోతున్నాయి. ఈ వారంలోనే ఆయా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లలో అడుగుపెట్టనున్నాయి. శామ్సంగ్ ఎస్-పెన్ ఫీచర్‌తో విడుదల చేసే ట్యాబ్లెట్ సిరీస్‌తో పాటు ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లను ఆవిష్కరించనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. మరి వాటి వివరాలేంటో ఓ సారి లుక్కేద్దామా..
గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్
గతేడాది వచ్చిన గెలాక్సీ ఎస్21 మోడల్‌కు కొనసాగింపుగా గెలాక్సీ ఎస్22, ఎస్22 ప్లస్, ఎస్22 అల్ట్రా మోడల్స్‌ను శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో (ఫిబ్రవరి 9న) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వారంలో గెలాక్సీ ట్యాబ్ ఎస్8, ఎస్8+, ఎస్ ఆల్ట్రా సిరీస్‌లను శాంసంగ్ విడుదల చేయనుంది.
120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ట్యాబ్ ఎస్8ను 14.6 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, ఎస్8+ను 12.4 డిస్ప్లేతో తీసుకురానుంది. ఆల్ట్రా ఎస్8 ట్యాబ్ సిరీస్‌లు 11,200ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ముందువైపు రెండు 12 మెగాఫిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎస్-పెన్ ఫీచర్‌ను సపోర్ట్ చేసేలా వీటిని రూపొందించింది. అదేవిధంగా గెలాక్సీ ట్యాబ్ ఎస్8+ మోడళ్లలో 10,090ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, ట్యాబ్ ఎస్ 8 మోడళ్లలో 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది.
ఒప్పో ఫైండ్ x5 సిరీస్
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కూడా కొత్త తరహ మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఒప్పో సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్5, ఫైండ్ ఎక్స్5 ప్రో మోడళ్లు ఈవారమే విడుదల కానున్నాయి. వీటిలో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌ను వాడారు. తొలిసారిగా హసెల్బ్లాడ్ బ్రాండింగ్ భాగస్వామ్యంతో ఒప్పో ఈ మోడళ్లను రూపొందించింది. ఒప్పో ఫైండ్ x5 సిరీస్ మోడల్ ఫోన్లు రెండు కలర్లలో (వైట్, బ్లాక్) రానున్నాయి. అలాగే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో ఫైండ్ ఎక్స్5 మొబైల్స్‌ను ఒప్పో తీసుకురానుంది. వీటిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.
వివో వీ23ఈ
వివో కంపెనీ ఫ్లాగ్షిప్ శ్రేణిలో ఇదివరకే వివో వీ23 పేరుతో రెండు మోడళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటికి కొనసాగింపుగా వివో వీ23ఈ సిరీస్‌ను విడుదల చేయనుంది. వీ23ఈ సిరీస్ 6 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్లను ఉపయోగించారు. వీటి బ్యాటరీ సామర్థ్యం 4,200 ఎంఏహెచ్‌గా ఉంటుంది. కెమెరాపరంగా సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ముందు భాగంలో 50 ఎంపీ, 98 ఎంపీ రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా ఉండనుంది. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మ్యాక్రో లెన్స్ ఉండనున్నాయి.
రియల్ మీ నార్జో 50
నార్జో సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను రియల్మీ తీసుకురానుంది. ఈ మోడళ్లను ఫిబ్రవరి 24వ రోజున విడుదల చేయనుంది. రియల్మీ నార్జో 50 సిరీస్‌లో ఇప్పటికే 50ఐ, రియల్మీ నార్జో 50ఏ మోడళ్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారుడిని ఆకట్టుకోనుంది. వీటిలో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు అప్‌గ్రేడెడ్ నైట్ ఫొటోగ్రఫీ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రియల్ మీ నార్జో 50 సిరీస్ యూజర్లకు మంచి పనితీరుతో ముందుకు వస్తోంది. ఇందులో మీడియాటెక్ హిలీయో G96 గేమింగ్ ప్రాసెసర్, అద్భుతమైన డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, దీర్ఘకాల బ్యాటరీ సామర్థ్యంతో విడుదల చేస్తున్నాం’’ అని రియల్ మీ సంస్థ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.