Smartphones: ఈ వారంలో రిలీజ్‌ అయ్యే స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసా?

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఆకట్టుకునే మరిన్ని మోడల్స్‌ రాబోతున్నాయి. ఈ వారంలోనే ఆయా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లలో అడుగుపెట్టనున్నాయి.

Published : 21 Feb 2022 11:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఆకట్టుకునే మరిన్ని మోడళ్లు రాబోతున్నాయి. ఈ వారంలోనే ఆయా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లలో అడుగుపెట్టనున్నాయి. శామ్‌సంగ్‌ ఎస్‌-పెన్‌ ఫీచర్‌తో విడుదల చేసే ట్యాబ్లెట్‌ సిరీస్‌తో పాటు ఒప్పో, వివో, రియల్‌మీ కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లను ఆవిష్కరించనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. మరి వాటి వివరాలేంటో ఓ సారి లుక్కేద్దామా..


గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8 సిరీస్‌

గతేడాది వచ్చిన గెలాక్సీ ఎస్‌21  మోడల్‌కు కొనసాగింపుగా గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్లస్, ఎస్22 అల్ట్రా మోడల్స్‌ను శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో (ఫిబ్రవరి 9న) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వారంలో గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8, ఎస్‌8+, ఎస్‌ ఆల్ట్రా సిరీస్‌లను శాంసంగ్‌ విడుదల చేయనుంది.  
120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ట్యాబ్‌ ఎస్‌8ను 14.6 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లే, ఎస్‌8+ను 12.4 డిస్‌ప్లేతో తీసుకురానుంది. ఆల్ట్రా ఎస్‌8 ట్యాబ్‌ సిరీస్‌లు 11,200ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ముందువైపు రెండు 12 మెగాఫిక్సల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎస్‌-పెన్‌ ఫీచర్‌ను సపోర్ట్‌ చేసేలా వీటిని రూపొందించింది. అదేవిధంగా గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8+ మోడళ్లలో 10,090ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, ట్యాబ్‌ ఎస్‌ 8 మోడళ్లలో 8,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది.


ఒప్పో ఫైండ్‌ x5 సిరీస్‌

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో కూడా కొత్త తరహ మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఒప్పో సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్5, ఫైండ్ ఎక్స్5 ప్రో మోడళ్లు ఈవారమే విడుదల కానున్నాయి. వీటిలో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 చిప్‌సెట్‌ను వాడారు. తొలిసారిగా  హసెల్‌బ్లాడ్‌ బ్రాండింగ్ భాగస్వామ్యంతో ఒప్పో ఈ మోడళ్లను రూపొందించింది. ఒప్పో ఫైండ్‌ x5 సిరీస్‌ మోడల్‌ ఫోన్లు రెండు కలర్లలో (వైట్‌, బ్లాక్‌) రానున్నాయి. అలాగే 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో ఫైండ్ ఎక్స్5 మొబైల్స్‌ను ఒప్పో తీసుకురానుంది. వీటిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.


వివో వీ23ఈ

వివో కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ శ్రేణిలో ఇదివరకే వివో వీ23 పేరుతో రెండు మోడళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటికి కొనసాగింపుగా వివో వీ23ఈ సిరీస్‌ను విడుదల చేయనుంది. వీ23ఈ సిరీస్‌ 6 జీబీ ర్యామ్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉండనుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్లను ఉపయోగించారు. వీటి బ్యాటరీ సామర్థ్యం 4,200 ఎంఏహెచ్‌గా ఉంటుంది. కెమెరాపరంగా సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ముందు భాగంలో 50 ఎంపీ, 98 ఎంపీ రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా ఉండనుంది. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 2ఎంపీ మ్యాక్రో లెన్స్‌ ఉండనున్నాయి.


రియల్‌ మీ నార్జో 50

నార్జో సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను రియల్‌మీ తీసుకురానుంది.  ఈ మోడళ్లను ఫిబ్రవరి 24వ రోజున విడుదల చేయనుంది. రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో ఇప్పటికే 50ఐ, రియల్‌మీ నార్జో 50ఏ మోడళ్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారుడిని ఆకట్టుకోనుంది. వీటిలో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో పాటు అప్‌గ్రేడెడ్‌ నైట్‌ ఫొటోగ్రఫీ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రియల్‌ మీ నార్జో 50 సిరీస్‌ యూజర్లకు మంచి పనితీరుతో ముందుకు వస్తోంది. ఇందులో మీడియాటెక్‌ హిలీయో G96 గేమింగ్ ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, దీర్ఘకాల బ్యాటరీ సామర్థ్యంతో విడుదల చేస్తున్నాం’’ అని రియల్‌ మీ సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని