ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో సేవలు బంద్‌..

వీడియోకాలింగ్‌ యాప్‌ గూగుల్ డ్యుయో సేవలు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నిలిచిపోనున్నాయా..అవుననే అంటున్నాయి టెక్‌ వర్గాలు. గూగుల్‌ సర్టిఫై చెయ్యని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ పనిచేయదట. ప్లే సర్వీసెస్‌ కోసం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు...

Published : 25 Jan 2021 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీడియోకాలింగ్‌ యాప్‌ గూగుల్ డ్యుయో సేవలు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నిలిచిపోనున్నాయా..అవుననే అంటున్నాయి టెక్‌ వర్గాలు. గూగుల్‌ సర్టిఫై చెయ్యని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ పనిచేయదట. ప్లే సర్వీసెస్‌ కోసం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేస్తుంది. దాని వల్ల గూగుల్ సూట్‌లోని అన్ని రకాల సేవలు ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌గా సదరు ఫోన్లలోకి వస్తాయి. ఒక వేళ ఏవైనా ఫోన్లకు గూగుల్ యాప్స్‌కు సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వకుంటే వాటిలో సదరు ఈ యాప్స్‌ పనిచేయవు. గతంలో ఇలానే కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ మెస్సేజెస్‌ సేవలు ఆగిపోయాయి. ఇదే తరహాలో తాజాగా గూగుల్ డ్యుయో సేవలు నిలిచపోనున్నాయి. ఈ మేరకు హువావే కంపెనీ మినహా నోకియా, శాంసంగ్, వన్‌ప్లస్‌, వివో, ఒప్పోతో పాటు ఇతర బ్రాండ్లలో ఈ యాప్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలుస్తోంది. 

గూగుల్ డ్యుయో సేవలు నిలిచిపోయే ఫోన్లలో యాప్‌ ఓపెన్ చేసిన వెంటనే ‘త్వరలో డ్యుయో ఆగిపోతుంది. ఎందుకంటే మీరు ధృవీకరించని డివైజ్‌ ఉపయోగిస్తున్నారు. మీ ఖాతాను ఈ డివైజ్‌ నుంచి తొలగించడం జరుగుతుంది’ అనే మెస్సేజ్ కనిపిస్తుంది. ఒక వేళ మీ ఫోన్లలో అలాంటి మెస్సేజ్‌ కనిపిస్తే మార్చి 31లోపు డ్యుయో ఖాతాలోని మీ కాల్‌ హిస్టరీ, వీడియో క్లిప్స్‌ అందులోంచి మరోచోట స్టోర్ చేసుకోవడం మంచిది. లేదంటే ఖాతాతో పాటు వాటిని కూడా మీరు కోల్పోయే అవకాశం ఉంది. వీడియో కాలింగ్‌ కోసం అందుబాటులో ఉన్న  ఆండ్రాయిడ్ యాప్స్‌లో గూగుల్ డ్యుయో కూడా ఒకటి. ఇందులో ఒకేసారి 32 మంది వీడియో కాల్‌ మాట్లాడుకోవచ్చు. గూగుల్ డ్యుయో సేవలు నిలిచిపోయిన యూజర్స్ ప్రత్యామ్నాయంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, జూమ్‌, జియోమీట్‌, స్నాప్‌ఛాట్ వంటి వాటిని ఉపయోగించొచ్చని టెక్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

ఇవీ చదవండి..

అన్ని మెసెంజర్లు ఒకే దాంట్లో!

ఫేస్‌బుక్‌కు కొత్త సమస్య..ఆటోమేటిక్‌గా లాగౌట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని