Google: గూగుల్ మెసేజెస్ అదరహో
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారిలో చాలామంది గూగుల్ మెసేజెస్‌ను ఇష్టపడతారు. ఇది ఆసక్తికర ఫీచర్లతో కూడుకుంది మరి. అలాంటి వాటిల్లో కొన్నిటిని తెలుసుకుందాం. స్నేహితుడి పుట్టినరోజు. అర్ధరాత్రి 12 గంటలకు మెసేజ్‌ను పంపిద్దామనుకున్నారు. కానీ మెలకువగా ఉంటామో లేదో.
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారిలో చాలామంది గూగుల్ మెసేజెస్‌ను ఇష్టపడతారు. ఇది ఆసక్తికర ఫీచర్లతో కూడుకుంది మరి. అలాంటి వాటిల్లో కొన్నిటిని తెలుసుకుందాం.
నిర్ణీత సమయానికే: స్నేహితుడి పుట్టినరోజు. అర్ధరాత్రి 12 గంటలకు మెసేజ్‌ను పంపిద్దామనుకున్నారు. కానీ మెలకువగా ఉంటామో లేదో. ముందే పంపిస్తే బాగుండదు. మరెలా? గూగుల్ మెసేజెస్ ఉంటే ఇలాంటి దిగులు అవసరం లేదు. ఇందులో నిర్ణీత సమయానికి మెసేజ్‌ను పంపిచే వీలుంది. కన్వర్జేషన్‌ను ఓపెన్ చేసి, ప్లస్ గుర్తు మీద నొక్కితే ‘షెడ్యూల్ సెండ్’ ఫీచర్ కనిపిస్తుంది. మెసేజ్ పంపించాల్సిన సమయాన్ని ఎంచుకొని, టైప్ చేసి ‘సెండ్’ చేస్తే చాలు. నిర్ణీత సమయానికి మెసేజ్ వెళ్తుంది.
అంశం స్పష్టంగా: సహోద్యోగుల వంటివారికి అధికారిక మెసేజ్‌లు పంపాలనుకుంటే సబ్జెక్ట్ లైన్‌ను జత చేసుకోవచ్చు. దీంతో అవతలివారికి విషయమేంటన్నది వెంటనే అవగతమవుతుంది. ఇందుకోసం కన్వర్జేషన్‌ను ఓపెన్ చేసి, పైన కనిపించే మూడు చుక్కల మెనూను నొక్కి ‘షో సబ్జెక్ట్ ఫీల్డ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. సబ్జెక్ట్ లైన్‌ను, మెసేజ్‌ను రాసి సెండ్ చేయాలి. కావాలంటే అర్జంట్ అనీ గుర్తు చేయొచ్చు.
తేలే ఛాట్ బబుల్: రకరకాల పనుల్లో మునిగినప్పుడు మేసేజ్‌లను తేలికగా గుర్తించటానికి ఛాట్ బబుల్స్ బాగా తోడ్పడతాయి. ‘మెసేజెస్ సెటింగ్స్’లోకి వెళ్లి ‘బబుల్స్’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ నోటిఫికేషన్స్ మెనూలో ‘ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్’ రూపంలో ఉండొచ్చు. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే అందే మెసేజ్‌లన్నీ కొత్త ఛాట్ బబుల్ రూపంలో పాప్ అప్ అవుతాయి.
నాణ్యమైన వీడియోలు: గూగుల్ మెసేజెస్‌తో గానీ ఇతర ఎంఎంఎస్ యాప్స్‌తో గానీ వీడియోలను పంపిస్తే క్వాలిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే సైజ్ పరిమితికి తగినట్టుగా వీడియో కంప్రెస్ అవుతుంది. అదృష్టం కొద్దీ గూగుల్ మెసేజెస్‌లో క్వాలిటీ దెబ్బతినకుండా వీడియోలను పంపించుకునే సదుపాయం ఉంది. ఇందుకు ముందుగా ప్రొఫైల్ పిక్చర్ ద్వారా ‘మెసేజెస్ సెటింగ్స్’లోకి వెళ్లాలి. మెనూలో ‘గూగుల్ ఫొటోస్’ను తాకి ‘ఆల్వేస్ సెండ్ వీడియో బై లింక్ టెక్స్ట్ (ఎస్‌ఎంఎస్/ ఎంఎంఎస్) ఫీచర్‌ను ఆన్ చేయాలి. దీంతో వీడియోలను పంపిస్తున్నప్పుడు అవి గూగుల్ ఫొటోస్ లింక్ రూపంలో అవతలివారికి చేరతాయి.
డెస్క్‌టాప్ మీదా: ఇతర మెసెజెస్ యాప్‌లతో పోలిస్తే గూగుల్ మెసేజెస్‌తో ఒనగూరే మరో ప్రయోజనం డెస్క్‌టాప్ మీదా ఉపయోగించుకునే వీలుండటం. మెసేజెస్ ఫర్ వెబ్ ద్వారా దీన్ని వాడుకోవచ్చు. ఒకసారి దీన్ని సెట్ చేసుకుంటే చాలు. ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ మీద వాడుకోవచ్చు. కొత్త మెసేజ్‌లను చూడటానికి ప్రతిసారీ ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సిన అవసరం ఉండదు.
టెక్స్ట్ సైజ్ మార్పు: గూగుల్ మెసేజెస్‌లో టెక్స్ట్ సైజును పెద్దగా లేదా చిన్నగా చేసుకునే సదుపాయమూ ఉంది. తెర మీద రెండు వేళ్లను ఆనించి జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మెసేజెస్ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘పించ్ టు జూమ్ కన్వర్జేషన్ టెక్స్ట్’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే చాలు.
ఓటీపీ మెసేజ్‌ల ఆటో డిలీట్: ఇటీవల ఓటీపీలు మామూలు విషయంగా మారాయి. వీటి అవసరం కొద్దిసేపే అయినా అవి అలాగే ఉండిపోతాయి. ఇవీ స్పేస్‌ను తీసుకుంటాయి. మోసం చేయటానికి హ్యాకర్లు వీటిని ఉపయోగించుకోవచ్చు కూడా. ఇక్కడే ఆటో డిలీట్ సదుపాయం మేలు చేస్తుంది. ఇది 24 గంటల తర్వాత ఓటీపీ మెసేజ్‌లను డిలీట్ చేసేస్తుంది. సెటింగ్స్ ద్వారా మెసేజ్ ఆర్గనైజేషన్‌లోకి వెళ్లి దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు.
రిమైండర్: ఆత్మీయుల పుట్టినరోజులైనా కొన్నిసార్లు మరచిపోతుంటాం. ఇలాంటి సమయంలో రిమైండర్ సాయం చేస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే సమయానికి ఆ తేదీని గుర్తుచేస్తుంది. ఇందుకోసం మెసేజెస్ సెటింగ్స్‌లోకి వెళ్లి సజెషన్స్ ద్వారా నడ్జెస్‌లోకి వెళ్లాలి. అక్కడ బర్త్‌డే రిమైండర్స్ ఫీచర్‌ను ఎంచుకోవాలి. అయితే కాంటాక్ట్స్ జాబితాలో అప్పటికే వారి పుట్టిన తేదీని జత చేసుకుంటేనే ఇది పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి.
అంశాల వారీ శోధన: ఎప్పుడో, ఎవరికో ఏదో మెసేజ్ పంపిస్తాం. అదేంటో చప్పున గుర్తుకురాదు. వివిధ విభాగాల మీద సెర్చ్ చేస్తే తేలికగా పట్టుకోవచ్చు. ఇందుకోసం సెర్చ్ బార్ మీద తాకితే ఇమేజెస్, వీడియోస్, లింక్స్, లొకేషన్స్.. ఇలా రకరకాల విభాగాలు కనిపిస్తాయి. వీటిల్లోంచి తేలికగా కావాల్సిన మెసేజ్‌ను వెతుక్కోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక