సండే టిప్‌: మొబైల్‌‌ డేటాతో యాప్‌ పని చేయొద్దా!

యాప్‌లను ఓపెన్‌ చేసి ఉంచినా.. లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూనే ఉంటాయి....

Updated : 28 Feb 2021 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాప్‌లను ఓపెన్‌ చేసి ఉంచినా.. లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూనే ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో పంపే ఇమేజ్‌లు, వీడియోలు కూడా డౌన్‌లోడ్‌ కావడం వల్ల అనవసరంగా మొబైల్‌ డేటా అయిపోవడం జరుగుతుంది. చాలా యాప్స్‌ యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ డేటాను లాగేస్తుంటాయి. మరి అలాంటి అక్కర్లేని డౌన్‌లోడ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ రన్నింగ్‌ వల్ల డేటా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. దీని నుంచి బయటపడేందుకు చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మన డేటా సేఫ్‌గా ఉండటంతోపాటు పనికిరాని డౌన్‌లోడ్స్‌ను అరికట్టవచ్చు. అయితే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌కు సంబంధించి ఒక్కో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఒక్కోలా సెట్టింగ్స్‌  ఉంటాయి. మరి ఏ విధంగా డేటాను సేవ్‌ చేసుకోవచ్చో చూసేయండి..

చేయడం ఎలాగంటే..?

స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన సెట్టింగ్స్‌ను క్లిక్‌ చేయండి.
అందులోని నెట్‌వర్క్‌ & ఇంటర్నెట్‌ క్లిక్‌ చేసి.. డేటా యూసేజ్‌ ఓపెన్‌ చేయాలి. ఇందులో అప్పటి వరకు వాడిన డేటా ఎంతనేది తెలుసుకోవచ్చు. 
యాప్‌ డేటా యూసేజ్‌ క్లిక్‌ చేసి ఒక్కో యాప్‌కు ఎంత మేరకు డేటాను వాడారో తెలిసిపోతుంది. 
అవసరం లేని యాప్‌కు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌ డేటాను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవడం ఉత్తమం.
అలానే ‘అన్‌రిస్ట్రిక్ట్‌డ్‌ డేటా’ను క్లిక్‌ చేసి మొబైల్‌ డేటా, వైఫై ఆప్షన్స్‌లో రెండూ లేదా ఒకదానినే ఎంచుకోవచ్చు. దీని వల్ల మొబైల్‌ డేటా, వైఫై ద్వారా వచ్చే డేటాను మాత్రమే వినియోగించుకుంటుంది. 
దీని వల్ల యూట్యూబ్‌ వంటి యాప్స్‌ మొబైల్‌ డేటా కాకుండా వైఫై ఉన్నప్పుడు మాత్రమే రన్ అయ్యేలా చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని