Tech Tip: మెసేజ్‌ను జూమ్‌ చేయొచ్చు?

గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌నకు సరికొత్త ఫీచర్‌ యాడ్ అయిందని మీకు తెలుసా...? చాటింగ్‌ టెక్ట్స్‌ను రీసైజ్‌ చేసుకుని చూసే అవకాశం ఉంది..

Updated : 27 Jun 2021 17:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌నకు సరికొత్త ఫీచర్‌ ఒకటి యాడ్ అయిందని తెలుసా? ఛాటింగ్‌ టెక్ట్స్‌ను రీసైజ్‌ చేసి చూసుకునే అవకాశాన్ని గూగుల్‌ కల్పించింది. మనం సాధారణంగా పీడీఎఫ్‌ను జూమ్‌ ఇన్ అండ్‌ జూమ్‌ ఔట్‌ చేస్తాము కదా.. అదే విధంగా టెక్ట్స్‌ ఫాంట్‌ సైజ్‌ మారకుండా ఛాటింగ్‌ కన్వర్జేషన్‌ను పెద్దదిగానూ, లేదా చిన్నదిగా చేసుకునేలా వీలు కల్పించింది. మరీ చిన్నదిగా ఉంటే కళ్లకు కాస్త ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఈ కొత్త ఫీచర్‌ వల్ల ఎలాంటి సమస్య లేకుండా టెక్ట్స్‌ను రీసైజ్‌ చేసుకొని చదువుకోవచ్చని గూగుల్‌ చెబుతోంది. ఇలాంటి ఫీచర్‌ను తీసుకురావాలని యూజర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఎట్టకేలకు గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌లో ఫీచర్‌ యాడ్‌ అయిపోయింది. అయితే కొత్త ఫీచర్‌ను వాడాలంటే మాత్రం యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుని ఉండాలి. 8.X కన్నా తక్కువ వెర్షన్‌ యాప్‌లో ఈ ఫీచర్‌ పనిచేయదు. ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని