అంగారకుడి మీద వరి!
అంగారకుడి మీదికి మనుషులను పంపటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ రోజువారీ అవసరాలకు కావాల్సిన అన్నింటినీ భూమి మీది నుంచే తీసుకెళ్లటం అసాధ్యమనే చెప్పుకోవాలి.
అంగారకుడి మీదికి మనుషులను పంపటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ రోజువారీ అవసరాలకు కావాల్సిన అన్నింటినీ భూమి మీది నుంచే తీసుకెళ్లటం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఒకవేళ తీసుకెళ్లినా చాలా ఖర్చవుతుంది. అందుకే పంటలను అక్కడే పండించటం మీద దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సస్ అధ్యయనం కొంగొత్త ఆశలు రేకెత్తించింది. అంగారకుడి మట్టిలో వరి పండటానికి అవసరమైన అన్ని పోషకాలూ ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. కాకపోతే పర్‌క్లోరేట్ అనే విషతుల్య రసాయనాన్ని తట్టుకునేలా మార్పులు చేయాల్సి ఉంటుందని తేల్చారు. మొజావే ఎడారికి చెందిన అగ్నిశిల పొడితో అంగారకుడి ధూళిని పోలిన మట్టిని తయారుచేసి పరిశోధనలు నిర్వహించారు. దీన్ని వివిధ మిశ్రమాలతో కలిపి కుండీల్లో వేసి, వడ్లను చల్లి రోజుకు ఒకట్రెండు సార్లు నీరు పోశారు. అన్నింటిలోనూ వరి మొలకెత్తింది. అయితే కుండీల్లో మొక్కలను పెంచటానికి వాడే మిశ్రమాన్ని (కంపోస్టు, కొబ్బరి పీచు, బెరడు వంటి వాటితో చేసేది) కలిపిన అంగారకుడి మట్టి గల కుండీల్లో మరింత పెద్దగా మొలకలు వచ్చాయి. వేర్లు కూడా పెద్దగా మొలిచాయి. అంగారకుడి మట్టికి మొక్కల పెంపకానికి వాడే మిశ్రమాన్ని 25% కలిపినా మంచి ఫలితం కనిపిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అభిలాశ్ రామచంద్రన్ పేర్కొంటున్నారు. పర్‌క్లోరేట్‌ను తట్టుకునేలా జన్యుపరంగా మార్చిన అడవి వరి వంగడాన్ని కూడా పరీక్షించారు. కిలో మట్టిలో 3 గ్రాముల కన్నా ఎక్కువ పర్‌క్లోరేట్ ఉంటే విత్తనాలు మొలకెత్తలేదు. కానీ ఒక గ్రాము మోతాదు పర్‌క్లోరేట్ ఉన్న మట్టిలో మాత్రం భేషుగ్గా మొలకెత్తాయి. జన్యుపరంగా మార్చిన వరి అంగారకుడి మీదా పండగలదని ఈ అధ్యయనం రుజువు చేసింది. అక్కడే వరిని పండిస్తే ఇంకేం కావాలి? తేలికగా అన్నం వండేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!