Telegram: టెలిగ్రామ్‌ ప్రీమియం వచ్చేస్తోంది.. అదనపు ఫీచర్ల కోసం సబ్‌స్క్రైబ్‌ చేయాల్సిందే!

టెలిగ్రామ్‌ మెసేజింగ్ యాప్‌ ప్రీమియం వెర్షన్‌ను తీసుకురానుంది. టెలిగ్రామ్‌ ప్రీమియం పేరుతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ వెర్షన్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం.

Published : 10 Jun 2022 01:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్‌ యూజర్ల గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూనే ఎప్పటికప్పుడు ఆసక్తికర ఫీచర్లను తీసుకొస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఉచిత మెసేజింగ్ యాప్‌ ప్రీమియం వెర్షన్‌ను తీసుకురానుందట. టెలిగ్రామ్‌ ప్రీమియం పేరుతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ వెర్షన్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా యాప్‌లో ప్రకటనలు కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమువుతోంది. ఇప్పటికే పబ్లిక్ ఛానల్స్‌లో ప్రకటనల తరహాలో స్పాన్సర్డ్‌ మెసేజ్‌లను పరిచయం చేసింది. 160 పదాలతో కూడిన ఈ మెసేజ్‌లలో ఎలాంటి వెబ్ లింక్‌లూ ఉండవు. అందులోని మెసేజ్‌పై యూజర్‌ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన చానల్‌కు యూజర్‌ను రీ డైరెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

టెలిగ్రామ్‌ ప్రీమియం ప్రారంభ సబ్‌స్క్రిప్షన్‌ ధర 4.99 డాలర్లుగా ఉంటుందని సమాచారం. ఈ ప్రీమియం వెర్షన్‌తో యూజర్లకు కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఫైల్‌ అప్‌లోడింగ్ సైజ్‌ 4జీబీకి పెంచడం, ఫాస్టర్‌ డౌన్‌లోడ్ స్పీడ్‌, వాయిస్‌-టు-టెక్ట్స్‌ కన్వర్షన్‌, యాడ్‌ ఫ్రీ, యూనిక్యూ రియాక్షన్స్‌, ప్రీమియం స్టిక్కర్స్‌, అడ్వాన్స్‌డ్‌ చాట్ మేనేజ్‌మెంట్, ప్రొఫైల్ బ్యాడ్జ్‌, యానిమేటెడ్ అవతార్‌, అడిషినల్‌ అప్లికేషన్ ఐకాన్స్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయట. అయితే ఇప్పటికే ఈ ప్రీమియం వెర్షన్‌ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే ఎంపిక చేసిన యూజర్లు మాత్రమే ఈ వెర్షన్‌ను విడుదల చేసినట్లు టెక్ వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని