
Windows 11: విండోస్‌లో ఆండ్రాయిడ్... ఎలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు లేకుండా!
ఇంటర్నెట్‌డెస్క్: మైక్రోసాఫ్ట్(Microsoft) విండోస్ ఓఎస్‌లో ఆండ్రాయిడ్ యాప్స్ వాడాలనుకునేవారికి ఇది శుభవార్త. విండోస్ 11 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ ఫీచర్ అప్డేట్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఆ అప్డేట్ను వాయిదా వేసుకుంటూ వచ్చిన మైక్రోసాఫ్ట్... టెస్టింగ్ కోసం బీటా యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. రెగ్యులర్ యూజర్స్ ఇంకొంత సమయం ఆగాల్సిందే. ఈ లోపు ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో చదివేయండి!
ఆండ్రాయిడ్ యాప్స్‌ను(Android Apps) విండోస్ ఓఎస్‌లో వాడాలంటే ఎమ్యులేటర్లని (బ్లూస్టాక్స్, నోక్స్ప్లేయర్, ఆండ్రాయిడ్ స్టూడియో) ఉపయోగిస్తుంటారు. ఎమ్యులేటర్ అంటే కంప్యూటర్లలో ఆండ్రాయిడ్ యాప్‌లు పనిచేసేందుకు ఉపయోగించే సాంకేతికత లేదా యాప్. కానీ విండోస్ 11(Windows 11) ఓఎస్‌లో ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం ఎమ్యులేటర్ల పనితీరుకంటే మెరుగ్గా ఉండే ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నామని మైక్రోసాఫ్ట్ చెప్పింది. ఆ ఫీచరే ఇప్పుడు యూజర్లకు అందించడానికి సిద్ధమవుతోంది.
ఇన్స్టాల్ చేసుకోటానికి ఏమేం కావాలంటే...
సిస్టమ్ హార్డ్‌వేర్ సపోర్ట్
విండోస్ 11 ఓఎస్ ఇన్స్టాల్/అప్డేట్ చేసుకోవాలంటే సిస్టమ్‌లో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలి. సిస్టమ్ 64 బిట్ అయి ఉండాలి. కనీసం 1 జీహెచ్‌జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయి ఉండాలి. కనీసం 4జీబీ ర్యామ్, 64 జీబీ ఫ్రీ స్టోరేజీ ఉండాలి.
విండోస్ 11 ఇన్సైడర్ బీటా ఛానెల్
విండోస్ 11లో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రన్ చేయాలంటే.. ముందుగా విండోస్ 11 ఇన్సైడర్ బీటా ఛానెల్లో యూజర్ అయివుండాలి. అప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్‌కు సంబంధించిన అప్డేట్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు బీటా ఛానెల్లో యూజర్ కాకపోతే.. ఇప్పుడైనా రిజిస్టర్ అవ్వచ్చు. (Register for the Windows Insider Program) ఈ లింక్ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ పేజీకి తీసుకొని వెళ్తుంది.
విండోస్ 11 బిల్డ్ వెర్షన్ (22000.xxx)
విండోస్ 11 బిల్డ్ వెర్షన్ (22000.xxx) చూసుకోవాలి. బిల్డ్ వెర్షన్‌ను తెలుసుకోవడానికి రన్ - కీబోర్డ్ షార్టకట్ (Win+R) ఓపెన్ చేసి ‘winver’ టైప్ చేయాలి. అప్పుడు ఓ బాక్స్ ఓపెన్ అయ్యి... మీకు ప్రస్తుతమున్న విండోస్ వెర్షన్‌ను చూపిస్తుంది. 22000.xxx లేకపోతే విండోస్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం సిస్టమ్ సెట్టింగ్స్‌లో విండోస్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్‌కు ఆప్డేట్ చేసుకోవచ్చు.
వర్చువలైజేషన్ సపోర్ట్
సిస్టమ్ బయాస్ (BIOS) సెట్టింగ్స్‌లో వర్చువలైజేషన్ ఆప్షన్ ఎనేబుల్ ఉందో లేదో చూసుకోవాలి. ఆ ఆప్షన్ ఎనేబుల్‌లో ఉందో లేదో తెలియాలంటే.. టాస్క్ మేనేజర్- కీబోర్డ్ షార్టకట్ (Ctrl+Shift+Esc) ఓపెన్ చేసి పెర్ఫార్మెన్స్ ట్యాబ్‌లో చూడాలి. ఒకవేళ లేకుంటే కంప్యూటర్ బూట్ ఆప్షన్‌కు వెళ్లి ‘సిస్టమ్ కాన్ఫిగరేషన్’ ట్యాబ్‌లో వర్చువలైజేషన్ టెక్నాలజీ ఎనేబుల్ చేయాలి.
మైక్రోసాఫ్ట్ స్టోర్ వెర్షన్
మైక్రోసాఫ్ట్ స్టోర్ వెర్షన్నూ చెక్ చేయాలి. మైక్రోసాఫ్ట్ స్టోర్ వెర్షన్ 22110.1402.6.0.. అంతకంటే హైఎండ్ వెర్షన్ అయివుండాలి. విండోస్ యాప్ సెట్టింగ్స్‌కు వెళ్లి చూస్తే.. ఏ వెర్షన్ ఉందో మనకు తెలుస్తుంది. ఒకవేళ పైన చెప్పిన వెర్షన్ లేకపోతే.. అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది.
విండోస్ 11 రీజియన్
సిస్టమ్‌లో ప్రస్తుతం మీరు ఉంటున్న ప్రాంతం యూఎస్ (US)గా మార్చుకోవాలి. దీని కోసం సిస్ట్మ్ సెట్టింగ్స్‌కు వెళ్లి (కంట్రీ ఆర్ రీజియన్) ఆప్షన్లో యూఎస్‌ను సెట్ చేయాలి.
చివరగా... అమెజాన్ అకౌంట్
చివరగా అమెరికాకు చెందిన అమెజాన్ అకౌంట్ ఉండాలి. ఆండ్రాయిడ్ యాప్స్ వాడేందుకు అమెజాన్ యాప్ స్టోర్‌లో లాగినై... అందులోని మనకు కావాల్సిన యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పరిమితంగా ముఖ్యమైన 50 యాప్స్ వరకు అందులో అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన యాప్స్‌లో మనకు కావాల్సిన యాప్స్ లేకుంటే.. డెవలపర్ మోడ్‌లోకి వెళ్లి... అక్కడ అందుబాటులో ఉంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఇన్స్టాల్ చేయండిలా...
ముందుగా మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ‘విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్’(Windows Subsystem for Android)ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. (Windows Subsystem for Android™ with Amazon Appstore) ఈ లింక్ ద్వారా డైరెక్ట్‌గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేశాక.. హోం స్క్రీన్ కింద చూపించిన చిత్రంలా కనిపిస్తుంది.
తర్వాత, అమెజాన్ యాప్ స్టోర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. (AmazonAppstore) ఈ లింక్‌ను క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యాక.. స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. మీకు కావల్సినవి ఇన్స్టాల్ చేసుకొని ఎంచక్కా వాడేయొచ్చు.
ఇక్కడ మీకు ఒక అనుమానం వచ్చి ఉంటుంది. అమెజాన్ యాప్ స్టోర్ ఉండగా.. మధ్యలో ఈ ‘విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్’ ఎందుకని? అమెజాన్ యాప్ స్టోర్ ద్వారా విండోస్ 11లో ఆండ్రాయిడ్ యాప్‌లను మరింత వేగంగా, శక్తిమంతంగా, ప్రభావవంతంగా పనిచేసేందుకు ‘విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్’ యాప్‌ను తీసుకొచ్చినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.
గమనిక: విండోస్ 11 బీటా వెర్షన్లో ఆండ్రాయిడ్ యాప్స్ లోడ్ చేసుకొని వాడుతున్నాం కనుక.. యాప్స్ అప్పుడప్పుడు క్రాష్ అవడం జరగొచ్చు. లేక మొబైల్ వెర్షన్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా పని చేయకపోవచ్చు. అలానే తక్కువ రేటింగ్ ఉన్న యాప్స్ వాడటం ఉత్తమం కాదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మార్పులు చేసుకోవడానికి మీరు పూర్తి సమ్మతంగా ఉంటేనే చేయాలి. లేదంటే రెగ్యులర్ యూజర్లకు ఈ ఫీచర్లు వచ్చేంతవరకు వేచి ఉండటం మంచిది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ruturaj Gaikwad: ఐర్లాండ్‌తో తొలి పోరులో రుతురాజ్ ఎందుకు ఆడలేదంటే?
-
Politics News
Andhra News: అమరావతిని శ్మశానమని.. ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా?: చంద్రబాబు
-
India News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. శిందే వర్గానికి సుప్రీం ఊరట..!
-
India News
Presidential Election: ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!
-
Business News
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో సూచీలు
-
Politics News
Sanjay raut: నన్ను చంపినా సరే ఆ రూట్‌ని ఆశ్రయించను: రౌత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- చెరువు చేనైంది