Published : 17 Nov 2021 01:31 IST

Android: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ తప్పులు చేశారో.. హ్యాకర్లకు దొరికేసినట్లే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్ల (Smart Phones) ప్రపంచంలో ఆండ్రాయిడ్‌ ఫోన్లదే హవా. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ (OS)లోని  ఫీచర్లు యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి. దానికి తగ్గట్టే ఆండ్రాయిడ్‌ (Android) ఫోన్లు వాడే వారికి ముప్పులూ పొంచి ఉన్నాయి. మొబైల్స్‌ వినియోగంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన పాలిట ముప్పులు అవుతాయని తెలుసా? అయితే చదివేయండి... తెలుసుకోండి... జాగ్రత్తపడండి!

అవసరం ఉన్నా లేకున్నా రకరకాల యాప్స్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసి ఓ లుక్కేసి వదిలేస్తుంటారు. ఒక్కోసారి ఏపీకేల రూపంలోనూ ఇన్‌స్టాల్‌ చేస్తుంటారు. ఇలాంటి యాప్స్‌తో హ్యాకర్స్‌ (Hackers), స్కామర్స్‌ (Scammers) ఉపాధి పొందుతున్నారు. మాల్‌వేర్‌ (Malware)ను పక్కన పెడితే కొన్ని యాప్‌లు మనకు ప్రకటనలు చూపిస్తూ... కాసులు వెనకేసుకుంటున్నాయి. వాటి వల్ల మన ఫోన్‌ నెమ్మదించడమే గాక, వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్తోంది.

బ్లోట్‌వేర్‌ (Bloatware)

బ్లోట్‌వేర్‌ (డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్‌) ఫోన్‌ మెమొరీని ఆక్రమించేస్తుంది. అంతేకాదు మిగతా యాప్‌ల (Apps) పనితీరును కూడా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కొత్త ఫోన్‌ కొనుగోలు చేసినప్పుడు ఫోన్‌తో పాటే బ్లోట్‌వేర్‌ వస్తుంటుంది. అందుకే వాటిని తొలగించడమే మేలు అని చెబుతున్నారు. అలానే కొన్ని యాప్స్‌ మన ప్రమేయం లేకుండానే ఫోన్‌లో తిష్ఠ వేస్తుంటాయి. యాడ్స్‌ డిస్‌ప్లే చేస్తూ.. డివైజ్‌ను (Device) ట్రాక్‌ చేస్తూ.. మన కాంటాక్ట్స్‌ లిస్ట్‌ను దొంగలిస్తూ ఉంటాయి. అలాంటి యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయండి.. కుదరని పక్షంలో సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటికి డేటా యాక్సెస్‌ ఆఫ్‌ చేసేయండి.


ఫోన్ లాక్ స్క్రీన్ ఇంకోటి

ఫోన్ లాక్ స్క్రీన్‌ను (Lockscreen) ప్రొటెక్ట్ చేసుకోవ‌డం కీల‌కం. లేక‌పోతే ఫోన్‌లోకి చొర‌బ‌డి హ్యాక‌ర్లు మ‌న‌కు తెలియ‌కుండానే మన స‌మాచారం దొంగిలిస్తారు. అంతేకాదు ఆన్‌లైన్‌లో పర్సనల్‌ డేటాను అందుబాటులోకి తెస్తుంటారు. అందుకే పిన్ లేదా బ‌యోమెట్రిక్ ఐడెంటిఫికేష‌న్ ద్వారా ఫోన్ లాక్ చేయాలి. కనీసం ప్యాట్ర‌న్ స్క్రీన్‌లాక్‌ అయినా పెట్టుకోవాలి.


గూగుల్‌ ఫైండ్ డివైజ్‌

ఎప్పుడు కొత్త ఫోన్‌ కొన్నా.. గూగుల్‌ (Google) ఫైండ్‌ డివైజ్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఎందుకంటే, ఫోన్‌ పోయినప్పుడు మీ డివైజ్‌ను ట్రాక్‌ చేయటానికి ఉపయోగపడుతుంది. అలానే పాస్‌వర్డ్ లేకుండా మీ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేయటం, మొబైల్ డేటాను ఆఫ్‌ చేయకుండా లాక్‌స్క్రీన్‌ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. 


యాప్స్‌ లిస్ట్‌ చెక్‌ చేసుకోవాలి

ఫోన్‌ సెట్టింగ్స్‌కు వెళ్లి డౌన్‌లోడ్‌ (Download) చేసిన యాప్స్‌ లిస్ట్‌ చూసుకుంటుండటం అలవాటుగా మార్చుకోవాలి. కొన్ని మాల్‌వేర్‌/ స్పైవేర్‌ యాప్స్‌ మనకు తెలియకుండానే ఫోన్‌ యాప్స్‌ లిస్ట్‌లో వచ్చి పడుతుంటాయి. అవి హోంస్క్రీన్‌లో ఐకాన్‌ కూడా క్రియేట్‌ చేయకుండా మన ఫోన్‌లో దాగి ఉంటాయి. అలాంటి వాటిని ఒకసారి చూసి అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయండి.


పాస్‌వర్డ్‌ ఛేంజ్‌ చేయకపోవడం...

ఎక్కువ‌మంది చేసే త‌ప్పు పాస్‌వర్డ్‌ తరచుగా మార్చకపోవడం. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం క్రియేట్‌ చేసిన లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌తోనే ఇప్ప‌టికీ బండి లాగించేస్తుంటారు. కానీ హ్యాక‌ర్ల‌కు ఇదే పెద్ద ఆయుధం. వారికి సందు దొరికేది ఇక్క‌డే. మ‌నం ప‌దే ప‌దే ఏ కీవ‌ర్డ్స్ టైప్ చేస్తున్నామో గుర్తించి దాని  ద్వారా మ‌న  లాగిన్ వివరాలు తెలుసుకోవడం వారికి పెద్ద క‌ష్టం కాదు. అందుకే మ‌న పాస్‌వ‌ర్డ్‌ల‌ను (Passwords) ఎప్ప‌టిక‌ప్ప‌డు మార్చుకుంటూ ఉండాలి. వీలైనంత క‌ష్టంగా మ‌న పాస్‌వ‌ర్డ్‌ల‌ను పెట్టాలి. అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ పెట్టకపోవడం ఉత్తమం.


థర్డ్‌ పార్టీ యాప్స్‌

ఫోన్లో థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయనివ్వకుండా సెట్టింగ్స్‌లో మార్పు చేయాలి. ఆ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయటం వల్ల మనకు తెలియకుండా ఇన్‌స్టాల్‌ అయ్యే యాప్స్‌ కాని, గూగుల్‌ ప్లే స్టోర్‌ (Google Play Store) నుంచి కాకుండా ఇతర సైట్ల నుంచి డౌన్‌లోడ్ అయ్యే యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయనివ్వకుండా నిరోధిస్తుంది. 


ఏపీకే(APK) ఫైల్స్‌

ఏపీకే ఫైల్స్‌ (APK Files) ఎలా పని చేస్తాయో తెలుసుకోకుండా డౌన్‌లోడ్‌ చేసి వాడేస్తే.. మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లోకి నెట్టుకున్నట్లే. గూగుల్‌ ప్లేస్టోర్‌లో దొరకని చాలా యాప్స్‌ ఏపీకే (ఆండ్రాయిడ్‌ ప్యాకేజ్‌ కిట్‌) ద్వారా బయట దొరకుతుంటాయి. అవి చాలా వరకు మీ అనుమతి లేకుండానే మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. అలాంటి వాటికి గూగుల్‌ అనుమతివ్వదు. అందుకే ప్లేస్టోర్‌లో దొరకవు. కావున ఏపీకే ఫైల్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


యాప్‌ పర్మిషన్స్‌

యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు... వాళ్లు పెట్టే షరతులు, నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక వాల్‌పేపర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాం. ఆ యాప్‌కు మన ఫోన్‌లో గ్యాలరీని (Gallery) యాక్సెస్‌ చేసుందుకు అనుమతి ఇస్తే సరిపోతుంది. అంతకుమించి కాంటాక్ట్స్‌ లిస్ట్‌, మైక్‌, జీపీఎస్‌ లొకేషన్‌, కెమెరా (Camera) తదితర వాటిని యాక్సెస్‌ చేసేందుకు పర్మిషన్‌ అడుగుతుంటే.. ఆ యాప్‌ మంచిదా, కాదా అని ఆలోచించాల్సిందే. ప్రత్యామ్నాయ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మంచిది.

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని