Oppo: రెనో సిరీస్‌లో 5జీ ఫోన్లు..ఫీచర్లివే
ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో రెనో 6 5జీ, రెనో 6 ప్రో 5జీ పేరుతో వీటిని తీసుకొచ్చింది. రెనో 6 ప్రీమియం మిడ్ రేంజ్లో రెనో 6 మోడల్, ఫ్లాగ్షిప్ కేటగిరిలో రెనో 6 ప్రోను పరిచయం చేశారు. గతంలో విడుదల చేసిన రెనో 5 సిరీస్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్లను తీసుకొచ్చారు....
ఇంటర్నెట్‌డెస్క్: ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో రెనో 6 5జీ, రెనో 6 ప్రో 5జీ పేరుతో వీటిని తీసుకొచ్చింది. రెనో 6 ప్రీమియం మిడ్ రేంజ్లో రెనో 6 మోడల్, ఫ్లాగ్షిప్ కేటగిరిలో రెనో 6 ప్రోను పరిచయం చేశారు. గతంలో విడుదల చేసిన రెనో 5 సిరీస్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్లను తీసుకొచ్చారు. వీటిలో ర్యామ్ ఎక్స్పాన్షన్ టెక్నాలజీ ఇస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.3 ఓఎస్‌తో పనిచేస్తాయి. రెండు మోడల్స్ అరోరా, స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. మరి వీటిలో ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు..ధరెంతో తెలుసుకుందాం.
రెనో 6 5జీ
ఈ ఫోన్లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉపయోగించారు. వెనకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరా అమర్చారు. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65వాట్ సూపర్‌వీఓఓసీ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,990. ఆన్లైన్/ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చెయ్యొచ్చు.
రెనో 6 ప్రో 5జీ
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా అమర్చారు. వెనకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8ఎంపీ కెమెరా, రెండు 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో ఈ ఫోన్ లభిస్తుంది. దీని ధర రూ. 39,990.
ఒప్పో ఎన్కో ఎక్స్
వీటితోపాటు ఒప్పో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో ఎన్కో ఎక్స్ పేరుతో వీటిని ప్రవేశపెట్టారు. ఇందులో డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. మూడు మైక్రో ఫోన్లు ఉన్నాయి. నీటిలో పడినా పాడవకుండా ఉండేందుకు ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఇస్తున్నారు. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటలపాటు (ఛార్జింగ్ కేస్‌తో కలిపి) నిరంతరాయంగా పనిచేస్తాయి. వీటి ధర రూ. 9,990 కాగా, ప్రారంభ ఆఫర్ కింద రూ. 1000 డిస్కౌంట్ ఇస్తున్నారు. బ్లూ కలర్లో లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్