Updated : 29 Dec 2021 20:05 IST

Year Ender 2021: ఈ ఏడాదిలో దుమ్మురేపిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది చాలా కంపెనీలు.. రకరకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటిలో కొన్నింటిని వినియోగదారులు విపరీతంగా కొనుగోలు చేశారు. అయితే.. ఈ సంవత్సరంలో శాంసంగ్‌, షావొమీ, వివో, వన్‌ప్లస్‌, యాపిల్, రియల్‌మీ, ఒప్పో, ఆసుస్‌, జియో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకంగా విడుదల చేశాయి. కొన్ని ప్రీమియం ఫీచర్లతో వచ్చిన స్మార్ట్‌ ఫోన్లు కాగా మరికొన్ని బడ్జెట్‌, మిడ్ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్ కేటగిరిలో కంపెనీలు తీసుకొచ్చాయి.  మరి వాటిలో మేటి స్మార్ట్‌ఫోన్లు ఏంటో తెలుసా..? తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం ఓసారి అలా చూసేయండి..!


యాపిల్‌  ఐఫోన్ 13

యాపిల్‌ ఐఫోన్‌ 13(Apple Iphone 13) ... 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. ప్రధాన కెమెరా 12 మెగాపిక్సల్స్‌ (ఎంపీ) కాగా వీడియోల కోసం సినిమాటిక్ మోడ్ ఫీచర్‌ అందిస్తున్నారు. ఐఫోన్ 12 (Iphone 12) మోడల్స్‌లో కంటే ఐఫోన్ 13లో అధిక స్టోరేజ్‌ (128జీబీ) సామర్థ్యం ఇస్తున్నారు. లేటెస్ట్‌ ఏ15 బయానిక్‌ చిప్‌, ఐఓఎస్‌ 15తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ, 3,227 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ, 20W ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర ₹79,900.

* వెనుక కెమెరా: డ్యుయల్‌ కెమెరా(12ఎంపీ + 12ఎంపీ)
* ముందు కెమెరా: 12ఎంపీ  * రిజల్యూషన్‌: 2532x1170 పిక్సల్స్‌
* ఇంటర్నల్‌ స్టోరేజ్‌: 128జీబీ/ 256జీబీ / 512జీబీ

శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 3

అత్యంత మన్నికైన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌గా (Samsung Galaxy Z Fold 3) ఈ మోడల్‌కు పేరుంది. 6.2 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. 120హెడ్జ్‌ స్క్రీన్‌ రీఫ్రెష్‌ రేట్‌, 4,400ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, వాటర్ ఫ్రూఫ్‌, 64 బిట్‌ ఆక్టాకోర్‌ చిప్‌సెట్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌ వంటి ఫీచర్లు ఈఫోన్‌లో ఉన్నాయి. ప్రధాన డిస్‌ప్లే 7.6 అంగుళాల QXGA+ డైనమిక్‌ అమోల్డ్‌. మొత్తంగా ఐదు కెమెరాలను ఈ ఫోన్‌కు అమర్చారు. దీని ప్రారంభ ధర ₹1,49,999.

* వెనుక కెమెరా: ట్రిపుల్‌ కెమెరా(12ఎంపీ + 12ఎంపీ  + 12ఎంపీ)
* ముందు కెమెరా: డ్యుయల్‌ కెమెరా (10ఎంపీ + 4ఎంపీ)  
* ర్యామ్: 12జీబీ  * స్టోరేజ్‌: 256జీబీ / 512జీబీ
* రిజల్యూషన్‌: 2208x1768 పిక్సల్స్‌(మెయిన్‌ స్క్రీన్‌), 832x2268 పిక్సల్స్‌ (కవర్‌ స్క్రీన్‌)

వివో x70 ప్రో+

స్నాప్‌డ్రాగన్‌ 888+ ప్రాసెసర్‌తో వివో x70 ప్రో+ (Vivo X70 Pro+) పని చేస్తుంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 55 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50వాట్‌ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 10 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌తో (Android 11 OS) నడుస్తుంది. గింబల్‌ క్వాడ్‌-రేర్‌ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకత. దీని ధర వచ్చేసి ₹79,990.

* వెనుక కెమెరా: క్వాడ్‌ కెమెరా(48ఎంపీ + 50ఎంపీ + 12ఎంపీ + 8ఎంపీ)
* ముందు కెమెరా: 32ఎంపీ  * డిస్‌ప్లే: 6.78 అంగుళాలు 
* ర్యామ్: 12జీబీ  * స్టోరేజ్‌: 256జీబీ  * రిజల్యూషన్‌: 1440x3200 పిక్సల్స్‌

ఐకూ 7 లెజెండ్‌

పవర్‌ ప్యాక్డ్‌ గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌లో ఐకూ 7 లెజెండ్‌ (i Qoo 7 Legend) కూడా ఒకటి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ లభిస్తోంది. 48ఎంపీ ట్రిపుల్‌ రేర్‌ కెమెరాతో వస్తుంది. హెచ్‌డీ+ అమోల్డ్‌ డిస్‌ప్లే, 120హెడ్జ్‌ స్క్రీన్‌ రీఫ్రెష్‌ రేట్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 66 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 39,990.

* వెనుక కెమెరా: ట్రిపుల్‌ కెమెరా(48ఎంపీ + 13ఎంపీ + 13ఎంపీ)
* ముందు కెమెరా: 16ఎంపీ  * డిస్‌ప్లే: 6.62 అంగుళాలు 
* ర్యామ్: 8జీబీ/12జీబీ  * స్టోరేజ్‌: 128జీబీ/ 256జీబీ

శాంసంగ్‌ గెలాక్సీ S21 అల్ట్రా

ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ మొబైల్‌ S21 సిరీస్‌లోనే (Samsung Galaxy S21 Ultra) టాప్ ఎండ్ మోడల్‌. దీని ప్రారంభ ధర వచ్చేసి ₹1,05,999గా ఉంది. క్వాడ్‌ కెమెరా సెటప్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతోపాటు 25వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. వీటికి తోడు 15వాట్‌ క్యూఐ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఇస్తున్నారు.

* వెనుక కెమెరా: క్వాడ్‌ కెమెరా(108ఎంపీ + 12ఎంపీ + 10ఎంపీ + 10ఎంపీ)
* ముందు కెమెరా: 40ఎంపీ  * డిస్‌ప్లే: 6.80 అంగుళాలు 
* ర్యామ్: 12జీబీ/16జీబీ   * స్టోరేజ్‌: 256జీబీ/ 512జీబీ

వన్‌ ప్లస్‌ 9 ప్రో

ఖరీదైన స్మార్ట్‌ఫోన్లలో (OnePlus 9 Pro) ఇది కూడా ఒకటి. ధర ₹64,999పైన ఉన్నప్పటికీ.. అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో పాటు 65వాట్‌ వ్రాప్‌ ఛార్జ్‌ సపోర్ట్‌తో వస్తుంది. 50వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కూడా కంపెనీ అందిస్తోంది.

* వెనుక కెమెరా: క్వాడ్‌ కెమెరా(48ఎంపీ + 50ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ)
* ముందు కెమెరా: 16ఎంపీ   * డిస్‌ప్లే: 6.70 అంగుళాలు 
* ర్యామ్: 8జీబీ/12జీబీ  * స్టోరేజ్‌: 128జీబీ/ 256జీబీ

నోకియా XR20

నోకియాలో మిలిటరీ గ్రేడ్‌ డిజైన్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ ఫోన్‌ ఈ మోడలే. అత్యధికంగా 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. అత్యల్పంగా 20 డిగ్రీల వాతావరణంలోనూ ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 1.8మీటర్ల ఎత్తు నుంచి పడినా లేక నీటిలో పడినప్పుడు ఒక గంట సేపు ఉన్నా ఫోన్‌కు ఎటువంటి హాని జరగదని కంపెనీ చెబుతోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4630ఎంఏహెచ్‌ బ్యాటరీ, 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను ఇస్తున్నారు. దీని ధర ₹44,990.

* ముందు కెమెరా: 8ఎంపీ  * డిస్‌ప్లే: 6.67 అంగుళాలు ఫుల్‌ హెచ్‌డీ+
* వెనుక కెమెరా: డ్యుయల్ కెమెరా(48ఎంపీ + 13ఎంపీ)
* ర్యామ్: 6జీబీ  * స్టోరేజ్‌: 128జీబీ 

ఎంఐ 11x ప్రో

4,520ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఈ మొబైల్‌  వస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌  888 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.67 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ తెరను వాడారు. ట్రిపుల్‌ వెనుక కెమెరా, డాల్బీ అట్మాస్‌ ఫీచర్‌తో డ్యుయల్‌ స్పీకర్స్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర ₹36,999గా ఉంది. 

* ముందు కెమెరా: 20ఎంపీ  *రిజల్యూషన్‌: 1080x2400 పిక్సల్స్‌
* వెనుక కెమెరా: ట్రిపుల్‌ కెమెరా(108ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ)
* ర్యామ్: 8జీబీ  * స్టోరేజ్‌: 128జీబీ/ 256జీబీ

రియల్‌మీ GT

స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ అమర్చిన ఫోన్లలో ఇది అతి చౌకైనది. దీని ప్రారంభ ధర  ₹37,999. 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 65వాట్‌ సూపర్‌డార్ట్‌ ఛార్జ్‌ సపోర్ట్‌, 6.43 అంగుళాల డిస్‌ప్లే, 120 హెడ్జ్‌ స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

* ముందు కెమెరా: 16ఎంపీ  *రిజల్యూషన్‌: 2400 x 1080 పిక్సల్స్‌
* వెనుక కెమెరా: ట్రిపుల్‌ కెమెరా(64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ)
* ర్యామ్: 8జీబీ/ 12జీబీ  * స్టోరేజ్‌: 128జీబీ/ 256జీబీ

ఆసుస్‌ ROG ఫోన్‌ 5

భారత్‌లో 12జీబీ ర్యామ్‌తో విడుదలైన మొదటి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆసుస్‌ ROG ఫోన్‌ 5 కావడం విశేషం. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్ ఉపయోగించారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 144 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 49, 999.

* ముందు కెమెరా: 24ఎంపీ  *రిజల్యూషన్‌: 2400 x 1080 పిక్సల్స్‌
* వెనుక కెమెరా: ట్రిపుల్‌ కెమెరా(64ఎంపీ + 13ఎంపీ + 5ఎంపీ)
* ర్యామ్: 8జీబీ/ 12జీబీ  * స్టోరేజ్‌: 128జీబీ/ 256జీబీ

ఒప్పో రెనో 6 ప్రో

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా అమర్చారు.  4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 39,990. 

* ముందు కెమెరా: 32ఎంపీ  * రిజల్యూషన్‌: 2400 x 1080 పిక్సల్స్‌
* వెనుక కెమెరా: క్వాడ్‌ కెమెరా(64ఎంపీ + 8ఎంపీ + 8ఎంపీ)
* ర్యామ్: 12జీబీ  * స్టోరేజ్‌: 256జీబీ

జియో ఫోన్ నెక్స్ట్‌

ఇందులో స్నాప్‌డ్రాగన్ 215 క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌, ఆటోమేటిక్‌ రీడ్‌-అలౌడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్ట్స్‌, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇస్తున్నారు. గూగుల్ అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్‌ను ఇందులో వినియోగించారు. దీని ధర వచ్చేసి ₹6,499గా ఉంది.

* ముందు కెమెరా: 8 ఎంపీ రిజల్యూషన్‌: 720 x 1440 పిక్సల్స్‌
* వెనుక కెమెరా: 13ఎంపీ * ప్రాసెసర్‌: క్వాడ్‌ కోర్‌
* ర్యామ్: 2జీబీ  * స్టోరేజ్‌: 32జీబీ

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని