Twitter Tips: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ట్విటర్ ఖాతా సేఫ్!
మీ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురవ్వకుండా కొన్ని చిట్కాలు.. అవేంటో తెలుసుకోండి!
ఇంటర్నెట్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక ఎన్నో రకాల అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకొని వాడేస్తున్నాం. మొబైల్ గేమ్స్ నుంచి సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ వరకు అన్నీ.. అవసరం లేకున్నా ఫోన్లో అలా ఇన్స్టాల్ చేసేస్తాం. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురవుతూవుంటాయి. మన ప్రమేయం లేకుండానే మన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఇబ్బందికర పోస్టింగ్‌లు ప్రత్యక్షమవుతాయి. ఈరోజు తెల్లవారుజామున ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కూడా హ్యాక్ అవడమే ఇందుకు ఉదాహరణ. ఈనేపథ్యంలో మన ట్విటర్ అకౌంట్ భద్రంగా ఉందో లేదో ఓసారి చూద్దాం. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. కుదిరితే వాటిని పాటిద్దాం...
✅ ఇతర వెబ్సైట్లకు ఉపయోగించని స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను మీ ట్విటర్ అకౌంట్‌కు పెట్టాలి.
✅ టూ-ఫాక్టర్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంటే ఈ-మెయిల్ లేదా మొబైల్‌కు వెరిఫికేషన్ కోడ్ వచ్చేలా సెట్ చేసుకోవడం.
✅ ట్విటర్ అకౌంట్‌కు మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అనుసంధానించాలి. ఎప్పుడైనా అకౌంట్ పాస్వర్డ్ రీసెట్ చేయటానికి ఉపయోగపడుతుంది. హ్యాకర్స్ రీసెట్ పాస్వర్డ్ ద్వారా మీ అకౌంట్‌ను హ్యాక్ చేయటానికి ప్రయత్నించినా.. మీ మొబైల్, ఈ-మెయిల్‌కు అలర్ట్ మెసేజ్ పంపి ట్విటర్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది.
✅ ట్విటర్ అని గూగుల్ సెర్చ్ చేస్తే ఒరిజినల్ వెబ్‌సైట్‌కు బదులు కొన్నిసార్లు నకిలీ వెబ్సైట్లు వస్తుంటాయి. వాటి నుంచి లాగిన్ అయితే ఇక మన పని అంతే.. twitter.com నుంచే లాగిన్ అవుతున్నారో లేదో చెక్ చేసుకొంది. మన లాగిన్ సమాచారాన్ని దొంగలించటానికి ఇతర డూప్లికేట్ లింక్స్‌ని గూగుల్‌లో సెర్చ్‌లో హ్యాకర్స్ అందుబాటులో ఉంచుతుంటారు.
✅ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులెవరికీ మీ అకౌంట్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను ఇవ్వొద్దు.
✅ మీ కంప్యూటర్లోని సాఫ్ట్వేర్లు, మొబైల్ అప్లికేషన్లు, బ్రౌజర్లు, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండేలా చూసుకోండి.
✅ అకౌంట్ వెరిఫికేషన్‌కు లేదంటే ఇతర అవసరాల కోసం ఈ-మెయిల్, మెసేజ్ ద్వారా ట్విటర్ తన యూజర్లను అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇవ్వమని అడగదు. ఇది ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలి.
✅ మీకు తెలియకుండా మీ ఈ-మెయిల్ అడ్రస్‌ను ఎవరన్నా అప్డేట్ చేసినా.. మీ పాత ఈ-మెయిల్‌కు ట్విటర్ నోటిఫికేషన్ పంపుతుంది. తద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. మీరు మార్చకపోతే వెంటనే ఆ అప్డేట్ను క్యాన్సిల్ చేసే వెసులుబాటును ట్విటర్ కల్పిస్తుంది.
✅ లాగిన్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. మీ మొబైల్ ఫోన్ నుంచి కాకుండా వేరే ఫోన్ల నుంచి మీరు లాగిన్ అయినట్టు చూపిస్తుంటే.. వెంటనే ఆ డివైజ్ నుంచి లాగ్అవుట్ అవ్వండి. ఇంకా అనుమానంగా ఉంటే వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చేయండి.
✅ ట్వీట్స్‌ను ఈజీగా షేర్ చేయడానికి కొంత మంది షార్టన్ లింక్స్ వాడుతుంటారు. ఆ లింక్స్ ఏ డొమైన్‌కు వెళ్తుందో చెప్పలేం. కాబట్టి అలాంటి లింక్స్ ఓపెన్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అవసరమనుకుంటేనే వాటి జోలికి వెళ్లండి.. లేదంటే వదిలేయటం ఉత్తమం.
► Read latest Tech & Gadgets News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. -
నవ ఫీచర్ల వాట్సప్
నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్, వెబ్ వర్షన్లలో యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్ క్లయింట్ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. -
తాత్కాలిక మెయిల్ కోసం
ఖాళీ సమయంలో గిగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. -
ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. -
వీడియో కాల్ చేస్తున్నా సంగీతం వినొచ్చు
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్