Tesla Pi Phone: మస్క్‌ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!

ఎలాన్‌ మస్క్‌ త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నారట. దీనిపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా మస్క్‌ ఏం చేసినా ప్రత్యేకమే. ఈ నేపథ్యంలో మస్క్‌ విడుదల చేయనున్న ఫోన్‌ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Updated : 17 Oct 2022 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాన్ మస్క్‌ ఏం చేసినా ప్రత్యేకమే. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌, టెస్లా ఎనర్జీ, స్టార్‌లింక్‌, న్యూరాలింక్‌, ది బోరింగ్‌, ఓపెన్ ఏఐ కంపెనీలే అందుకు ఉదాహరణ. ఇటీవలే.. బార్ట్న్‌ హెయిల్ పేరుతో పెర్‌ఫ్యూమ్‌ అమ్మకాలు ప్రారంభించాడు. ఇక ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావాల్సివుంది. గతేడాది చివర్లో ఎలాన్‌ మస్క్‌ కొత్తగా స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోని అడుగుపెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. తాజాగా, మరోసారి మస్క్‌ తీసుకొస్తున్న ఫోన్‌ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ ఏడాది డిసెంబరులో మస్క్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. మరి, ఈ ఫోన్‌కు మస్క్‌ ఏం పేరు పెట్టనున్నారు? ధరెంత ఉంటుంది? ఫీచర్లేంటి? వంటి వివరాలను చూద్దాం.

పై ఫోన్ (Pi Phone)

మస్క్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను పై ఫోన్‌ అనే పేరుతో తీసుకొస్తున్నారు. ఇందులో 120 రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నట్లు సమాచారం. దీనికి ఒలియోఫోబిక్‌ కోటింగ్‌తో స్క్రాచ్‌ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు మూడు 50 ఎంపీ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ముందుభాగంలో 40 ఎంపీ పంచ్‌హోల్ కెమెరా ఇస్తున్నారట. ఈ ఫోన్ కోసం టెస్లా సొంతంగా ప్రాసెసర్‌ను తయారుచేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందట. ఈ ఫోన్ ధర ₹ 70 వేల నుంచి ₹ 80 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఇందులో శాటిలైట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారట. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుందా? లేక టెస్లా సొంత ఓఎస్‌ను అభివృద్ధి చేస్తుందా? అనేది తెలియాలంటే డిసెంబరు వరకు వేచిచూడాల్సిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని