Tesla Smartphone: టెస్లా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లివే!
టెస్లా కంపెనీ కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందట. మరి ఈ ఫోన్ ధరెంత, ఎలాంటి ఫీచర్లుంటాయి, ఎప్పడు విడుదల చేయనున్నారనేది చూద్దాం.
ఇంటర్నెట్‌డెస్క్: టెస్లా (Tesla) కంపెనీ పేరు వినగానే మనకు ఎలక్ట్రిక్ కార్లు, ఎలాన్ మస్క్ (Elon Musk) గుర్తొస్తారు. అంతేకాదు స్పేస్ ఎక్స్ (SpaceX) పేరుతో మస్క్ అంతరిక్ష పరిశోధన సంస్థను కూడా నెలకొల్పారు. ఇప్పటికే ఈ సంస్థ ఫాల్కన్ రాకెట్ల ద్వారా స్టార్ లింక్ శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటితోపాటు మస్క్ అత్యంత వేగంగా ప్రయాణం చేయగల సౌలభ్యమున్న హైపర్‌లూప్ సాంకేతికతను కూడా అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా మస్క్ స్మార్ట్‌ఫోన్ తయారీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారట. త్వరలో టెస్లా కంపెనీ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో టెస్లా స్మార్ట్‌ఫోన్‌పై మార్కెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఫోన్ పేరేంటి? ధరెంత?ఎలాంటి ఫీచర్లుంటాయి, ఎప్పుడు విడుదల చేస్తారు వంటి వాటి గురించి నెటిజన్లు చర్చించుకోవడం ప్రారంభించారు. మరి టెస్లా స్మార్ట్‌ఫోన్ గురించి వివరాలేంటో చూద్దాం.
మోడల్ పై
టెస్లా కంపెనీ విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌ను మోడల్ పై/పీ (Model Pi/P) అని పిలుస్తారట. అయితే దీనిపై టెస్లా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ దాదాపు ఈ పేరు ఖాయమని నెట్టింట్లో టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. టెస్లా గతంలో కూడా ఎన్నో భిన్న ఉత్పత్తులను విడుదల చేసింది. సైబర్ ట్రక్, పిల్లల్ల కోసం ఎలక్ట్రిక్ వెహికిల్, టెస్లా గొడుగు, స్టీల్‌తో చేసిన విజిల్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అదే తరహాలో టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
టెస్లా స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం టెస్లా గేమింగ్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫోన్ పై భాగంలో నేవీ బ్లూ కలర్, కింద స్కై బ్లూ రంగులతోపాటు, ఫోన్ వెనుకవైపు టెస్లాకు గుర్తుగా ‘T’ అక్షరం లోగో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్లో 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలుంటాయట. స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని సమాచారం. అలానే 6.5 అంగుళాల 4K రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుందట. 2 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ర్యామ్, ఓఎస్ గురించి వివరాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫోన్‌ను వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.
టెస్లా స్మార్ట్‌ఫోన్ ధర 800 డాలర్ల నుంచి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 60 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉంటుంది. భారత మార్కెట్లో ప్రస్తుతం ఈ ధరలో ప్రీమియం కేటగిరీలో శాంసంగ్ గెలాక్సీ ఎస్21, వన్‌ప్లస్ 9 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, వివో ఎక్స్70 ప్రో ప్లస్, ఐఫోన్ 13 మోడల్స్ ఉన్నాయి.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే