iOS16 Update: యాపిల్ కొత్త ఐఓఎస్.. ఈ మోడల్స్‌కు మాత్రమే!
యాపిల్ త్వరలో కొత్తగా ఐఓఎస్ 16 ఓఎస్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ ఓఎస్ కొన్ని ఐఫోన్, ఐపాడ్ మోడల్స్‌లో మాత్రమే అప్డేట్ అవుతుంది. మరి ఆ మోడల్స్ ఏంటో చూద్దాం.
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవలే యాపిల్ కంపెనీ కొత్తగా ఐఓఎస్ 15 ఓఎస్‌ను విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం యూజర్స్ వ్యక్తిగత సమాచార గోప్యతకు ప్రాధాన్యమిస్తూ ఐఓఎస్ 15.2 అప్డేట్ను పరిచయం చేసింది. దీని సాయంతో మొబైల్లోని ఏయే యాప్స్ యూజర్ డేటాను ట్రాక్ చేస్తున్నాయనేది తెలుసుకోవచ్చు. తాజాగా యాపిల్ కంపెనీ కొత్త వెర్షన్ ఓఎస్‌ను విడుదల చేయనుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఐఓఎస్ 15కు కొనసాగింపుగా ఐఓఎస్ 16 పేరుతో ఈ ఓఎస్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ఓఎస్ ఏ9/ఏ9ఎక్స్ చిప్సెట్తో పనిచేస్తున్న కొన్ని డివైజ్‌లను సపోర్ట్ చేయదని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఐఫోస్ 6 ఎస్ సిరీస్, మొదటి జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ, ఐపాడ్ 5, ఐపాడ్ మినీ 4, ఐపాడ్ ఎయిర్ 2, మొదటి జనరేషన్ 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. గత మూడేళ్లలో యాపిల్ ఐఓఎస్ కంపాటబుల్ జాబితా నుంచి ఐఫోన్/ఐపాడ్ తొలగించలేదు. దాంతో ఏడు సంవత్సరాల క్రితం విడుదలైన మోడల్స్ కూడా ఐఓఎస్ 13, ఐఓఎస్ 14 అప్డేట్లను పొందాయి. అయితే త్వరలో రానున్న ఐఓఎస్ 16తో ఈ ప్రక్రియ మారనుంది. దీంతో ఐఓఎస్ 16 కొన్ని మోడల్స్‌లో మాత్రమే అప్డేట్ అవుతుందని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ మోడల్స్ ఏంటో చూద్దాం.
ఐఫోన్ 13 సిరీస్ | ఐఫోన్ 12 సిరీస్ | ఐఫోన్ 11 సిరీస్ | ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ | ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ | ఐఫోన్ ఎక్స్ | ఐఫోన్ ఎక్స్ఆర్ | ఐఫోన్ 8 సిరీస్ | ఐఫోన్ 7 సిరీస్ | ఐపాడ్ ప్రో 2021 | 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో (2016 తర్వాతి మోడల్స్) | 10.5 అంగుళాల ఐపాడ్ ప్రో (2016 తర్వాతి మోడల్స్) | 11 అంగుళాల ఐపాడ్ ప్రో (2018 తర్వాతి మోడల్స్) | ఐపాడ్ ఎయిర్ 3 | ఐపాడ్ ఎయిర్ 4 | ఐపాడ్ ఎయిర్ 5 (2022 మోడల్) | ఐపాడ్ 6 | ఐపాడ్ 7 | ఐపాడ్ 8 | ఐపాడ్ 9 | ఐపాడ్ మినీ 5 | ఐపాడ్ మినీ 6 |
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tamilisai: పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
K Viswanath: బాల సుబ్రహ్మణ్యంకు కోపం వచ్చిన వేళ.. అలా నటుడిగా మారిన కె.విశ్వనాథ్
-
India News
Parliament: రెండోరోజూ అదానీ ఎఫెక్ట్.. వాయిదా పడిన ఉభయ సభలు
-
General News
Andhra News: వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్ ఓఎస్డీ
-
Politics News
Kakani Govardhan Reddy: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్