Flemish Scrollers: ఎంతసేపు మొబైల్ వాడారో చెప్పేస్తుందట!
ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేసే చోట మొబైల్‌ఫోన్ వినియోగిచడం అనేది సర్వసాధారణం. దీనివల్ల ఉత్పాదకత దెబ్బతింటుందనేది చాలా మంది వాదన. అయితే చట్టసభల్లో లేదా ప్రభుత్వ సమావేశాల్లో ముఖ్యమైన అంశాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు వాటిపై దృష్టి సారించకుండా మొబైల్‌ఫోన్‌లో తలమునలైపోతున్నారట....
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేసే చోట మొబైల్‌ఫోన్ వినియోగిచడం అనేది సర్వసాధారణం. దీనివల్ల ఉత్పాదకత దెబ్బతింటుందనేది చాలా మంది వాదన. అయితే చట్టసభల్లో లేదా ప్రభుత్వ సమావేశాల్లో ముఖ్యమైన అంశాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు వాటిపై దృష్టి సారించకుండా మొబైల్‌ఫోన్‌ను చూస్తూ ఉంటున్నారు. దీంతో చట్టసభల్లో ఏ నాయకుడు ఎంతసేను మొబైల్ ఉపయోగిస్తున్నారనేది తెలుసుకునేందుకు బెల్జియంకు చెందిన డ్రైస్ డిపూర్టర్ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఒక ప్రోగ్రాం రాశారు. ఇది ఫేస్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేస్తుంది. వాళ్లు సభలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతసేపు మొబైల్ ఉపయోగిస్తున్నారనేది దీని సాయంతో తెలుస్తుంది. ఆ సమయంలో వారు ఎందుకోసం అంటే తాము మాట్లాడాల్సిన అంశానికి సబంధించిన సమాచారం కోసం వెతుకుతున్నారా, మెయిల్స్ చెక్ చేస్తున్నారా, సామాజిక మాధ్యమాలను చూస్తున్నారా లేదా ఇతరత్రా కార్యక్రమాలకు మొబైల్ ఉపయోగిస్తున్నారా అనేది మాత్రం తెలియదు.
(Photo Credit: Dries Depoorter)
ఈ సాఫ్ట్‌వేర్‌ను బెల్జియం పార్లమెంట్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియోను ది ఫెల్మిష్ స్క్రోలర్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ను యాప్ రూపంలో త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని డిపూర్టర్ తెలిపారు. దీనివల్ల చట్టసభల్లో తమ నాయకులు ఏం చేస్తున్నారనేది సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. డిపూర్టర్ గతంలోనే డై విత్ మీ అనే ఒక విభిన్నమైన ఛాట్ యాప్‌ని అభివృద్ధి చేశారు. ఫోన్‌లో బ్యాటరీ ఛార్జింగ్ 5 శాతం కన్నా తక్కువ ఉంటేనే ఈ యాప్ పనిచేస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ 5 శాతం ఉన్నప్పుడు యాప్ ఓపెన్ చేసి ఇతరులతో ఛాట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
ChandraBabu: అక్రమాలను ఆడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?
-
India News
Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..! ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం
-
World News
Trump: ప్రైవేట్ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్!
-
Politics News
Nellore: హీటెక్కిన రాజకీయాలు.. ఆనంతో నెల్లూరు తెదేపా నేతల భేటీ
-
Movies News
Agent ott: ఆ మార్పులతో ఓటీటీలో అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?