​​​​​​Tech tips: మెయిళ్లు సురక్షితంగా...

నిత్యం మన ఇన్‌బాక్స్‌ని రకరకాల మెయిళ్లు ముంచెత్తుతుంటాయి. అనవసర మార్కెటింగ్‌ ఈమెయిళ్లూ చాలానే వస్తుంటాయి. అన్నీ సురక్షితమైనవి కాకపోవచ్చు! ఇవి మనల్న........

Published : 21 Apr 2021 16:05 IST

నిత్యం మన ఇన్‌బాక్స్‌ని రకరకాల మెయిళ్లు ముంచెత్తుతుంటాయి. అనవసర మార్కెటింగ్‌ ఈమెయిళ్లూ చాలానే వస్తుంటాయి. అన్నీ సురక్షితమైనవి కాకపోవచ్చు! ఇవి మనల్ని ట్రాక్‌ చేస్తుండొచ్చు. మెయిల్‌లోని ఇమేజ్‌లు లేదా లింకుల్లో పిక్సల్‌ ట్రాకర్స్‌ దాగి ఉండొచ్చు! మెయిల్‌ని ఓపెన్‌ చెయ్యగానే పిక్సెల్‌లో ఉన్న కోడ్‌ మెయిల్‌ను ఎప్పుడు ఓపెన్‌ చేశారు? ఎక్కడ నుంచి ఓపెన్‌ చేశారు? లాంటి వివరాల్ని కంపెనీ సర్వర్లకి పంపే అవకాశం ఉంది. మెయిల్‌లో ఇమేజ్‌ ఆటోలోడ్‌ని డిజేబుల్‌ చేయడం ద్వారా దీన్నుంచి చాలావరకు బయటపడొచ్చు. ఇందుకోసం డెస్క్‌టాప్, ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో సెట్టింగ్స్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దామా?

జీమెయిల్‌లో.. కుడివైపున పైన ఉండే సెట్టింగ్స్‌ ఐకాన్‌ మీద నొక్కి, ‘సీ ఆల్‌ సెట్టింగ్స్‌’ ప్రెస్‌ చెయ్యాలి. ‘జనరల్‌’ ట్యాబ్‌లో ‘ఇమేజెస్‌’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘ఆస్క్‌ బిఫోర్‌ డిస్‌ప్లేయింగ్‌ ఎక్స్‌టర్నల్‌ ఈమేజెస్‌’ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత అలాగే సెట్టింగ్స్‌ కిందివరకూ వెళ్లి ‘సేవ్‌ ఛేంజెస్‌’ నొక్కాలి. కాకపోతే దీంతో జీమెయిల్‌ డైనమిక్‌ ఈమెయిల్‌ ఫీచర్‌ కూడా టర్న్‌ ఆఫ్‌ అవుతుందనీ గుర్తుంచుకోవాలి.


మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ (ఆఫీస్‌ 365)లో.. ‘ఫైల్‌’ మీద క్లిక్‌ చేసి ‘ఆప్షన్స్‌’లోకి వెళ్లాలి. ‘అవుట్‌లుక్‌ ఆప్షన్స్‌’ విండోలో ‘ట్రస్ట్‌ సెంటర్‌’ సెలెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత ‘ట్రస్ట్‌ సెంటర్‌ సెట్టింగ్స్‌’ బటన్‌ నొక్కి ఫొటోలు ఆటోలోడ్‌ కాకుండా ఆప్షన్‌ ఎంచుకోవాలి.


ఆండ్రాయిడ్‌ జీమెయిల్‌లో.. ఎడమ వైపు పైన ఉండే మూడు అడ్డు గీతల మీద నొక్కి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ జీమెయిల్‌ అకౌంట్‌ మీద నొక్కి ‘ఇమేజెస్‌’ సెలెక్ట్‌ చేసుకుని, ‘ఆస్క్‌ బిఫోర్‌ డిస్‌ప్లేయింగ్‌ ఎక్స్‌టర్నల్‌ ఇమేజెస్‌’ మీద ట్యాప్‌ చెయ్యాలి. 


ఐఓఎస్‌ జీమెయిల్‌లో.. ఐఓఎస్‌ జీమెయిల్‌ ఓపెన్‌ చేసి, ఎడమవైపున పైన ఉండే హామ్‌బర్గర్‌ మెనూ ట్యాప్‌ చెయ్యాలి. అలా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఈమెయిల్‌ ఎకౌంట్‌ మీద తాకి, ‘ఇమేజెస్‌’ ఆప్షన్‌ను నొక్కాలి. అనంతరం ‘ఆస్క్‌ బిఫోర్‌ డిస్‌ప్లేయింగ్‌ ఎక్స్‌టర్నల్‌ ఇమేజెస్‌’ ఆప్షన్‌కు మారిపోవాలి.


ఐఓఎస్‌ ఈమెయిల్‌లో.. ‘సెట్టింగ్స్‌’లో ‘మెయిల్‌’లోకి వెళ్లి ‘మెసేజెస్‌’ సెక్షన్‌లో ‘లోడ్‌ రిమోట్‌ ఇమేజెస్‌’ని టాగిల్‌ఆఫ్‌ చెయ్యాలి.థండర్‌బర్డ్‌ లాంటి ఈమెయిల్‌ క్లయింట్స్‌ సాయంతోనూ మన సమాచారం మరొకరి చేతికి వెళ్లకుండా చూసుకోవచ్చు. ఇవి రిమోట్‌ ఇమేజెస్‌ని డిఫాల్ట్‌గా బ్లాక్‌ చేసేస్తాయి.


యాపిల్‌ మెయిల్‌లో.. ‘మెయిల్‌’ సెలెక్ట్‌ చేసి, ‘ప్రిఫరెన్సెస్‌’లో ‘వ్యూయింగ్‌’ ట్యాబ్‌ మీద క్లిక్‌ చెయ్యాలి. తర్వాత ‘లోడ్‌ రిమోట్‌ కంటెంట్‌ ఇన్‌ మెసేజెస్‌’ అన్‌చెక్‌ చెయ్యాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని