పాస్‌వర్డ్‌లతో పారాహుషార్‌!

కృత్రిమ మేధతో ఉపయోగాలే కాదు, ప్రమాదాలూ పొంచి ఉండొచ్చు. ఇది తరచూ వాడే పాస్‌వర్డ్‌లలో చాలావాటిని నిమిషంలోపే క్రాక్‌ చేస్తున్నట్టు తాజా పరిశోధనలో బయటపడింది మరి.

Published : 12 Apr 2023 00:09 IST

కృత్రిమ మేధతో ఉపయోగాలే కాదు, ప్రమాదాలూ పొంచి ఉండొచ్చు. ఇది తరచూ వాడే పాస్‌వర్డ్‌లలో చాలావాటిని నిమిషంలోపే క్రాక్‌ చేస్తున్నట్టు తాజా పరిశోధనలో బయటపడింది మరి. హోం సెక్యూరిటీ హీరోస్‌ వెబ్‌సైట్‌కు చెందిన పరిశోధకులు పాస్‌గాన్‌ అనే ప్రోగ్రామ్‌తో దీన్ని నిర్వహించారు. పాస్‌గాన్‌ అనేది కృత్రిమ మేధతో కూడిన పాస్‌వర్డ్‌ క్రాకర్‌. దీని ద్వారా సైబర్‌ పరిశోధకులు కోటిన్నరకు పైగా పాస్‌వర్డ్‌లను పరీక్షించారు. తరచూ వాడే వాటిల్లో ఇది 51% పాస్‌వర్డ్‌లను చిటికెలో కనిపెట్టేసింది. మరికొన్నింటిని గంటలోపు క్రాక్‌ చేసింది. పుట్టిన తేదీ, ఫోన్‌ నంబర్ల వంటి ఊహించటానికి తేలికైనవి, కొద్ది అక్షరాలతో కూడిన మామూలు పాస్‌వర్డ్‌లను ఇది త్వరగా ఛేదిస్తుండటం గమనార్హం. అందువల్ల ఏఐ విప్లవ యుగంలో పాస్‌వర్డ్‌ల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మామూలు, తేలికైన.. ముఖ్యంగా అంకెలు మాత్రమే గల పాస్‌వర్డ్‌లను పెట్టుకోవద్దు. కనీసం 15 క్యారెక్టర్లతో కూడిన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. వీటిల్లో అక్షరాలతో పాటు గుర్తులు, అంకెలూ ఉండాలి. క్యాపిటల్స్‌, చిన్న అక్షరాలు.. రెండింటినీ కలగలిపి ఎంచుకోవాలి. పాస్‌వర్డ్‌ల భద్రత కోసం పాస్‌వర్డ్‌ మేనేజర్లను వాడుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అలాగే ప్రతి మూడు లేదా ఆర్నెల్లకోసారి పాస్‌వర్డ్‌లను మార్చుకుంటూ ఉండాలి. అన్ని ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను పెట్టుకోవద్దు. ఇది చాలా ప్రమాదకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు