Smartphones under ₹10k: రూ.పదివేలలోపు ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలో పలు కంపెనీలు ఇప్పటికే కొన్ని ఫోన్లను విడుదల చేశాయి. మరి పదివేల లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఏవి?

Updated : 11 May 2022 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ బడ్జెట్‌లో అన్నీ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ల కోసం చాలా మంది వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలో పలు కంపెనీలు ఇప్పటికే కొన్ని ఫోన్లను విడుదల చేశాయి. మరి పదివేల లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఏవి? వాటి ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..


జియో  నెక్స్ట్‌ (JioPhone Next)

భారతీయ టెలికాం దిగ్గజం జియో సంస్థ గూగుల్‌తో కలిసి జియో ఫోన్‌ నెక్స్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సరసమైన ధరలో 4జీ సౌలభ్యం, ప్రీమియం ఫీచర్‌లతో ఈ మొబైల్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 215 క్యూఎమ్‌ ప్రాసెసర్‌ను వాడారు. వెనకాల 13 ఎంపీ, ముందు 8 ఎంపీ ఆటో ఫోకస్‌ కెమెరాలు అమర్చారు. 5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో.. 2జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. పైగా మెమొరీని 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు. 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. జియోఫోన్ నెక్స్ట్‌ ధర రూ.6,499గా కంపెనీ నిర్ణయించింది.


శాంసంగ్‌ గెలాక్సీ ఏ03 (Samsung Galaxy A03)

శాంసంగ్‌ గెలాక్సీ ఏ సిరీస్‌లో ఏ03 మోడల్‌ కూడా ధర పదివేల లోపు ఉన్న జాబితాలో ఉంది. దీని వెనుకభాగంలో 48ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు డెప్త్‌ సెన్సర్‌తో 2ఎంపీ కెమెరాను అమర్చారు. ఆక్టా కోర్‌ 1.6 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.7,999గా ఉంది.


టెక్నో స్పార్క్‌ 8 ప్రో (Tecno Spark 8 Pro price)

పదివేల లోపు ఉన్న ఫోన్ల జాబితాలో టెక్నో స్పార్క్‌ 8 ప్రో కూడా ఉంది. మీడియాటెక్‌ హీలియో జీ85 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో 6.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో 33 వాట్ ఛార్జింగ్‌ ను సపోర్ట్‌ చేస్తోంది. దీని ముందు భాగంలో 8ఎంపీ కెమెరాను అమర్చారు. వెనుక భాగంలో 48 ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ను ఇచ్చారు. దీని ధర రూ.9,999గా ఉంది.


రియల్‌మీ నార్జో 50ఐ (Realme Narzo 50i)

రియల్‌మీ కంపెనీ నార్జో సిరీస్‌లో విడుదల చేసిన 50ఐ మోడల్‌ కూడా ఈ జాబితాలో ఉంది. దీన్ని కంపెనీ గతేడాది సెప్టెంబరులోనే విడుదల చేసింది. ఇందులో ఆక్టాకోర్ యూనిసాక్‌ 9863 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5 అంగుళాల ఎల్‌సీడీ మల్టీ టచ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. వెనుకవైపు 8 ఎంపీ ఏఐ కెమెరా ఉంది. ముందు భాగంలో 5 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 2జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 7,499, 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ. 8,999గా నిర్ణయించారు.


రెడ్‌మీ 9 (Redmi 9)

రెడ్‌మీ 9 పేరుతో కొత్త మోడల్‌ను రెడ్‌మీ గతంలోనే విడుదల చేసింది. 6.53 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్ హీలియో జీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డెప్త్‌ సెన్సర్‌తో 2 ఎంపీ కెమెరాను అమర్చారు. ముందు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 8,999గా సంస్థ నిర్ణయించింది.


పోకో సీ31 (Poco C31)

బడ్జెట్‌ ధరలో పోకో బ్రాండ్‌ నుంచి పోకో సీ31 ఈ లిస్ట్‌లో ఉంది. 6.53 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను వాడారు. అంతర్గత మెమొరీని 512జీబీ వరకు పెంచుకునే వీలుంది. వెనుక వైపు 13 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు రెండు 2ఎంపీ కెమెరాలు అమర్చారు. సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులోని 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ రెండు రోజుల పాటు బ్యాకప్‌ ఇస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.8,499గా నిర్ణయించింది.


శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌12

పదివేలలోపు ఉన్న ఫోన్లలో శాంసంగ్‌ నుంచి మరో ఫోన్‌ గెలాక్సీ ఎఫ్‌12 కూడా  ఉంది. ఇందులో ఆక్టాకోర్‌ 850 ప్రాసెసర్‌ను వాడారు. 90హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో 6.5 హెచ్‌డీ డిస్‌ప్లే ఇచ్చారు. వెనకవైపు 48ఎంపీ ప్రధాన కెమెరా, 5ఎంపీ ఆల్ట్రా వైడ్‌ సెన్సర్‌, 2ఎంపీ డెప్త్‌ కెమెరా,  2ఎంపీ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. ముందువైపు 8ఎంపీ కెమెరాను అమర్చారు. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.9,499గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని