Year Ender 2021:₹5 వేలలోపు ధర.. ఈ ఏడాదిటాప్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!
ఈ ఏడాది ₹5 వేల లోపు ధరల్లో విడుదలైన టాప్ 5 స్మార్ట్‌వాచ్‌ల జాబితా మీ కోసం..
జిత్తులమారి కరోనా మహమ్మారి 2021లో ప్రజల్ని ఎంతో భయపెట్టిందో.. గ్యాడ్జెట్‌లకు అంతే దగ్గరగా చేసింది! లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం కావడం, సమావేశాలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను వాడటం, ఆరోగ్య సంరక్షణ, కొవిడ్ సమాచారం, వినోదం, విజ్ఞానంతో ఇలా అన్నింటికీ గ్యాడ్జెట్‌లను విరివిగా వాడారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ నోటిఫికేషన్ల నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రకాల సమాచారాన్ని చేరవేస్తుండటంతో స్మార్ట్‌వాచ్‌లకు ఈ ఏడాది డిమాండ్ కూడా భారీగానే పెరిగింది. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు దిగ్గజ కంపెనీలు వివిధ శ్రేణుల్లో స్మార్ట్‌వాచ్‌లు విడుదల చేశాయి. ఇందులో ఈ ఏడాది ₹5 వేలలోపు ధరల్లో ఎక్కువ ఫీచర్లతో విడుదలైన ఆ టాప్ 5 స్మార్ట్‌వాచ్‌ల జాబితా మీ కోసం..
షావోమి రెడ్‌మి వాచ్
1.4 అంగుళాల TFT LCD డిస్‌ప్లే, 320x320 పిక్సెల్ రిజల్యూషన్‌తో షావోమి Redmi Watchను విడుదల చేసింది. హార్ట్‌రేట్, స్లీప్ మానిటరింగ్, స్విమ్మింగ్, ట్రెడ్‌మిల్, జీపీఎస్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ సహా మొత్తం 11 రకాల స్పోర్ట్స్ మోడ్ ఫీఛర్లు ఇందులో ఉన్నాయి. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వాచ్ నీటిలో తడిచినా పాడవదు. ఇందులోని 230 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులపాటు బ్యాక్‌అప్ ఉంటుంది. నోటిఫికేషన్స్ అలారమ్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ధర రూ.3,999.
రియల్‌మీ వాచ్ 2
315 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.4 అంగుళాల కలర్ టచ్ స్క్రీన్ హై రిజల్యూషన్ డిస్‌ప్లేతో రియల్‌మీ వాచ్ 2 (Realme Watch 2) ఈ ఏడాది విడుదలైంది. ఐఓటీ స్మార్ట్ కంట్రోల్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, ఇంటలిజెంట్ రియల్ టైమ్ హార్ట్‌రేట్ మానిటర్, ఔట్-ఇన్ డోర్ 90 స్పోర్ట్స్ మోడ్ ఫీచర్లు వీటి ప్రత్యేకతలు. వాచ్ సాయంతో ఫోన్‌లో మ్యూజిక్, కెమెరా కంట్రోల్ చెయ్యొచ్చు. ధర రూ.3,499.
ప్లేఫిట్ స్లిమ్
ప్లేఫిట్ స్లిమ్ (Playfit Slim) స్మార్ట్‌వాచ్ ఫుల్-టచ్ డిస్‌ప్లే, వాటర్, డస్ట్ ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. స్పోర్ట్స్ మోడ్‌లు, హార్ట్‌రేట్, ఫిట్‌నెస్ ట్రాకర్, స్లీప్, SPO2 మానిటర్ ప్రత్యేకతలు. దీనిని ధరిస్తే సంప్రదాయ వాచ్ మాదిరిగా కనిపిస్తుంది. ధర రూ.3,999.
ఫైర్ బోల్ట్ 360
24/7 హార్ట్‌రేట్ సెన్సార్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఫీచర్లతో ఫైర్ బోల్ట్ (Fire Boltt 360) స్మార్ట్‌వాచ్ లభిస్తుంది. బ్లాక్, గ్రే, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇతర వాచ్‌ల మాదిరే ఇందులో కావాల్సినన్ని ఫీచర్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌లో పలు గేమ్‌లూ ఆడుకోవచ్చు. ధర రూ.3,999.
డిజో వాచ్ 2
1.69 అంగుళాల (4.3 cm) ఫుల్ టచ్ స్క్రీన్ మెటల్ బాడీతో డిజో వాచ్ 2 (Dizo Watch 2) భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంది. 15 రకాల స్పోర్ట్స్ మోడ్ ఫీచర్లు, 5 ఏటీఎం వాటార్ రెసిస్టెన్స్ వీటిలో ప్రత్యేకతలు. 90 రకాల బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ గైడ్ ఫీచర్ అదనం. ధర రూ.2,499.
-ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ‘కేఎల్ రాహుల్, డికాక్ ఆరెంజ్ క్యాప్ పోటీదారులుగా ఉంటారు’
-
India News
IN PICS: పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ప్రధాని మోదీ
-
World News
Helicopters Crash: కుప్పకూలిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు: 9మంది అమెరికా సైనికుల దుర్మరణం
-
Politics News
Pawan Kalyan: కౌలు రైతుల కడగండ్లకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణం: పవన్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్ మోదీ