Android 12: కొత్త ఆండ్రాయిడ్‌.. ఫీచర్లివే

Android 12 Beta Features: కొత్త ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ఎలా ఉంటుందో చూద్దాం!

Updated : 30 Aug 2022 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఫీచర్లతో ఆకట్టుకోవడానికి గూగుల్‌ ఏటా కొత్త ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) వెర్షన్‌ను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌ను సిద్ధం చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన బీటా వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ వెర్షన్‌ ప్రయోగాత్మకంగా కొంతమంది టెకీలు, ఔత్సాహికులకు అందించింది. వారి వివరాల ప్రకారం కొత్త ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ఎలా ఉంటుందో చూద్దాం!

ప్రస్తుతం విడుదలైంది తొలి బీటా వెర్షన్‌. ఇది కాకుండా జూన్‌, జులైలో రెండు బీటా వెర్షన్లు వస్తాయి. ఆగస్టు ఆఖరున స్టేబుల్‌ వెర్షన్‌ అందుబాటులోకి రావొచ్చు. ఇవి బీటా వెర్షన్‌లో ఉన్న ఆప్షన్లు. స్టేబుల్‌ వెర్షన్‌ను అందరికీ విడుదల చేసేటప్పుడు అందులో కొన్ని ఆప్షన్స్‌ ఉండకపోవచ్చు. ఇంకొన్ని అదనంగా ఉండొచ్చు. 

ఎవరెవరికి బీటా ప్రోగ్రామ్‌...

* గూగుల్‌ నుంచి...  పిక్సెల్‌ 3, గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ ఎల్‌, గూగుల్‌ పిక్సెల్‌ 3ఏ, గూగుల్‌ పిక్సెల్‌ 3 ఏ ఎక్స్‌ఎల్‌, గూగుల్‌ పిక్సెల్‌ 4, గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌, గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ, గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ 5జీకి ఆండ్రాయిడ్‌ 12 బీటా ప్రోగ్రామ్‌ వర్తిస్తుంది. 

* షావోమి నుంచి ఎంఐ 11, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ఎక్స్‌ ప్రో, ఎంఐ11ఐ కాగా... వన్‌ప్లస్‌ నుంచి వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో ఉన్నాయి. ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ 8 (జెన్‌ 8), ఒప్పొ ఫైండ్‌ ఎక్స్‌3 ప్రో, రియల్‌ మీ జీటీ, వీవో ఐకూ7, నోకియా ఎక్స్‌ 20 కూడా ఆండ్రాయిడ్‌ బీటా 12 ప్రోగ్రామ్‌ కిందకు వస్తాయి. ఈ మొబైల్స్‌ వినియోగించేవాళ్లు లింక్‌ లోకి వెళ్లి బీటా ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని