
Truecaller: ట్రూకాలర్ కొత్త ఫీచర్లు.. కాల్ రికార్డింగ్ నుంచి ప్రాంక్ కాల్స్ దాకా..
ఇంటర్నెట్‌డెస్క్: కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరి కొన్ని కొత్త ఫీచర్స్‌ను భారతీయ యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. వీటిలో వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్ అనౌన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి యూజర్స్‌కు భద్రతతోపాటు, సరికొత్త కాలింగ్ అనుభూతిని అందిస్తాయని ట్రూకాలర్ చెబుతోంది.
* వీడియో కాలర్ ఐడీ ఫీచర్ ద్వారా యూజర్స్ తమ స్నేహితులు, కుటుంబసభ్యలకు వీడియో కాల్ చేసినప్పుడు అవతలి వ్యక్తి కాల్ లిప్ట్ చేసిన వెంటనే ముందుగా వీడియో కనిపించేలా రికార్డు చేసిన వీడియో లేదా ట్రాకాలర్లో ఉన్న వీడియోలను యాడ్ చేయొచ్చు. దీని వల్ల వీడియో కాల్లో కాల్ చేసిన వ్యక్తి కాకుండా రికార్డ్ చేసిన వీడియో కనిపిస్తుంది.
* ఇప్పటి వరకు ప్రీమియం యూజర్స్‌కు అందుబాటులో ఉన్న కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను సాధారణ యూజర్స్‌కు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 5.1, ఆపై వెర్షన్ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో యూజర్ ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ను కూడా రికార్డ్ చేయొచ్చు. ఈ కాల్ రికార్డింగ్స్ మొబైల్ మెమొరీలోనే సేవ్ అవుతాయి. వీటిని యూజర్ డిలీట్, షేర్, మెయిల్ చేయొచ్చు.
* ఘోస్ట్ కాల్ ఫీచర్‌తో యూజర్స్ ప్రాంక్ కాల్స్ తరహా అనుభూతిని అందిస్తుంది. దీని సాయంతో యూజర్స్ ఇతరులకు కాల్ చేసినప్పుడు తమ వివరాలు కాకుండా ఇతరుల పేరు, నంబర్ లేదా ఫొటో కనిపించేలా మార్పులు చేయొచ్చు. దీంతో అవతలి వ్యక్తి మీరు కాల్ చేస్తున్నారని గుర్తించలేరు. అలానే ఈ ఫీచర్ ద్వారా యూజర్ ప్రాంక్ కాల్స్‌ను నిర్ణీత సమయానికి షెడ్యూల్ చేసుకోవచ్చని ట్రూకాల్ తెలిపింది. అయితే ఘోస్ట్ కాల్ ఫీచర్ కేవలం ప్రీమియం, గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.
* కాల్ అనౌన్స్ ఫీచర్‌తో మనకు ఫోన్ చేసిన వ్యక్తి పేరు, నంబర్ వంటి వివరాలు ట్రూకాలర్ యాప్ పెద్దగా చదివి వినిపిస్తుంది. ఇది యూజర్స్ ఫోన్లో కాంటాక్ట్ జాబితాలో ఉన్న వారితోపాటు ట్రూకాలర్ గుర్తించిన నంబర్స్‌కు కూడా వర్తిస్తుంది. సాధారణ కాల్స్‌తోపాటు ట్రూకాలర్ హెచ్డీ వాయిస్ కాల్స్‌కు ఈ ఫీచర్ పనిచేస్తుంది. కాల్ అనౌన్స్ ఫీచర్ కూడా ప్రీమియం, గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం భారత్‌లో ట్రూకాలర్ యాప్‌ను 22 కోట్ల మంది యూజర్స్ ఉపయోగిస్తున్నారు. యాజర్స్ వేగవంతమైన సేవలు అందిచడంతోపాటు, ఫోన్ బ్యాటరీ తక్కువగా వినియోగించేలా యాప్‌లో మార్పులు చేసినట్లు ట్రూకాలర్ తెలిపింది.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.