Truecaller: అధికారులమంటూ కాల్‌ చేస్తే.. ట్రూకాలర్‌ చెప్పేస్తుంది!

ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల పేరుతో స్పామ్‌కాల్స్‌ చేసే మోసగాళ్లకు చెక్‌ పెట్టేందుకు కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసంది. ఈ ఫీచర్‌తో యూజర్లు వెరిఫైడ్‌ ఫోన్‌ నంబర్లను సులువుగా గుర్తించవచ్చని తెలిపింది. 

Published : 06 Dec 2022 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, మంత్రిత్వశాఖల నంబర్లను సులువుగా గుర్తించవచ్చని తెలిపింది. ఇందుకోసం ట్రూకాలర్‌ ‘గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ’ పేరుతో ఫోన్‌ నంబర్ల జాబితాను సిద్ధం  చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, మంత్రుల కార్యాలయాల నంబర్లు ఉంటాయి. ఈ డిజిటల్ డైరెక్టరీతో యూజర్లకు స్పామ్‌కాల్స్‌ నుంచి భద్రత లభించడమే కాకుండా.. ప్రభుత్వ అధికారులకు తమ సమస్యలను ఫోన్‌ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుందని ట్రూకాలర్‌ చెబుతోంది.

‘‘ఫోన్‌కాల్స్‌ ద్వారా జరిగే మోసాల్లో ఎక్కువశాతం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల పేరుతో జరిగేవి ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇటువంటి స్పామ్‌కాల్స్‌ నుంచి యూజర్లు భద్రత కల్పించేందుకు గవర్నమెంట్‌ డిజిటల్‌ డైరెక్టరీని రూపొందించాం. ఇందులోని నంబర్ల నుంచి యూజర్‌కు కాల్‌ వస్తే.. ఫోన్‌ స్క్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్‌ కలర్‌ కనిపిస్తుంది. అలానే ఫోన్‌ నంబర్‌ పక్కన బ్లూ టిక్‌ కనిపిస్తుంది. ఈ రెండింటి వల్ల సదరు ఫోన్‌ నంబర్‌ వెరిఫైడ్‌ అని యూజర్ నిర్ధరించుకోవాలి’’ అని ట్రూకాలర్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఫోన్లలో ట్రూకాలర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసి ఈ ఫీచర్‌ను పొందవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని