Truecaller: ట్రూకాలర్‌లో కొత్తగా ఎమోజీలు.. ఈజీగా సెర్చింగ్‌.. ఇంకా ఏమొస్తున్నాయంటే?

Truecaller iOS update: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ కోసం ఉపయోగించే ట్రూకాలర్‌ యాప్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. 

Updated : 31 Aug 2022 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ కోసం ఉపయోగించే ట్రూకాలర్‌ (Truecaller) యాప్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఐవోఎస్‌ (iOS) యూజర్ల కోసం తీసుకొచ్చిన ఈ కొత్త యాప్‌లో ఆసక్తికర ఫీచర్లు జోడించారు. గత వెర్షన్లతో పోలిస్తే ఇందులో సెక్యూరిటీ, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగ్గా ఉంటాయని ట్రూకాలర్‌ చెబుతోంది. స్పామ్‌ కాల్స్‌ను గుర్తించడంలో కొత్త వెర్షన్‌ పదింతలు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. 

కొత్త అప్‌డేట్స్‌

  • స్కామ్‌, స్పామ్‌ తదితర సమస్యలను సృష్టించే కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచారట. దీంతో ఫేక్‌ కాల్స్‌ను సమర్థంగా గుర్తించొచ్చు. కాల్‌ రింగ్‌ అవుతున్నప్పుడే దాని వివరాలు సేకరించి, స్పామ్‌ అయితే యాప్‌ వెంటనే చెప్పేస్తుందట. దీని కోసం అల్గారిథమ్‌ను వాడుతున్నామని ట్రూకాలర్‌ చెబుతోంది. స్పామ్‌ నెంబరు నుంచి రెండోసారి కాల్‌ వస్తే.. మీ ప్రమేయం లేకుండానే దానిని స్పామ్‌గా గుర్తిస్తుందట. అలాగే స్పామ్‌ నంబర్ల గుర్తింపు సాంకేతికతను కూడా బాగా మెరుగుపరిచాం అని ట్రూకాలర్‌ వెల్లడించింది.

  • గతంలో ట్రూకాలర్‌ యాప్‌ ఓపెన్‌ చేసి అందులో సెర్చ్‌ ద్వారా కొత్త నెంబర్ల సమాచారం గురించి వెతికేవారు. ఇప్పుడు యాప్‌ ఓపెన్‌ చేయకుండా తెలుసుకునే సౌకర్యం అందిస్తున్నారట. ఏదైనా తెలియని నెంబరు నుంచి కాల్‌ వచ్చినప్పుడు, మాట్లాడుతుండానే ఆ వ్యక్తి వివరాలు ట్రూకాలర్‌లో తెలుసుకోవచ్చట. కాల్‌ లాగ్‌/లిస్ట్‌లోకి వెళ్లి.. నెంబరు పక్కనున్న ఇన్ఫో బటన్‌ క్లిక్‌ చేస్తే ‘సెర్చ్‌ ట్రూకాలర్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాని మీద క్లిక్‌ చేస్తే ఆ నెంబరు ట్రూకాలర్‌కి వెళ్లి సంబంధించిన వివరాలు వచ్చేస్తాయి. 

  • కాల్స్‌ను గుర్తించడానికి వీలుగా ఎమోజీల సౌకర్యాన్నికూడా తీసుకొచ్చారు. స్పామ్‌ కాల్‌ అయితే  వార్నింగ్‌ ఇచ్చేలా నెంబరు, పేరుతోపాటుఈ 🚨 ఎమోజీ వస్తుందట. అలాగే ఇబ్బందులు లేని నెంబరుకు ఈ ✅ ఎమోజీ చూపిస్తారట. ఒకవేళ ట్రూ కాలర్‌ వాడే ఆండ్రాయిడ్‌ యూజర్‌ అయితే ఈ 📲 ఎమోజీ వస్తుందట. వివరాలు అందుబాటులోని నెంబరు, లేదంటే బ్యాగ్రౌండ్‌లో సెర్చ్‌ చేస్తున్న నెంబరు అయితే ఈ 🔎 ఎమోజీ చూపిస్తుందట. 

గమనిక: ప్రస్తుతానికి ఈ ఫీచర్లు ఐవోఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లకు తీసుకొస్తారు. 

ఇవి త్వరలో...

వీటితోపాటు ఐవోఎస్‌ యాప్‌లో త్వరలో అందుబాటులోకి వచ్చే కొత్త ఆప్షన్ల గురించి కూడా ట్రూకాలర్‌ క్లుప్తంగా చెప్పింది. 

  • ఎస్‌ఎంఎస్‌ ఫిల్టరింగ్‌, స్పామ్‌  డిటెక్షన్‌, కమ్యూనిటీ బేస్డ్‌ సర్వీసెస్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు ట్రూకాలర్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. 
  • టాప్‌ స్పామర్స్‌.. అంటే ఎక్కువమంది స్పామ్‌ గుర్తించివారు, ట్రూకాలర్‌ టీమ్‌ స్పామ్‌గా గుర్తించిన నెంబర్ల నుంచి మీకు కాల్‌ వస్తే ఆటోమేటిక్‌గా ఆ నెంబరును యాప్‌ బ్లాక్‌ చేసేస్తుందట. 
  • స్పామ్‌ కాల్స్‌, నెంబర్ల వివరాలను స్టాటస్టిక్స్‌ రూపంలో యాప్‌లో పొందొచ్చు. దీని కోసం యాప్‌లో కొత్తగా ఆప్షన్‌ తీసుకొస్తారట. అందులో ఏదైనా నెంబరుకు మీరు అదనపు సమాచారం కూడా ఇవ్వొచ్చు. దానికి ట్రూకాలర్‌ టీమ్‌ పరిశీలించి ఉపయోగపడితే వాడుకుంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని