Android Launchers: పాత మెనూ, హోం స్క్రీన్ బోర్ కొట్టేశాయా..? వీటితో మొబైల్ లుక్ మార్చేయండి!
ఆండ్రాయిడ్ ఫోన్లో పాత మెనూ, హోమ్ స్క్రీన్ చూసి బోర్ కొట్టేసిందా.. అయితే మీ మొబైల్ ఫోన్ కొత్త లుక్ కోసం ఈ లాంచర్స్‌ను ప్రయత్నించవచ్చు.
ఇంటర్నెట్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫేస్ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలా మంది నుంచి వినిపించే సమాధానం.. వాల్‌పేపర్స్ లేదా హోమ్ స్క్రీన్ థీమ్ మార్చుకోమని సూచిస్తుంటారు. అయితే ఫోన్ పనిచేసేందుకు ఉపయోగించే ఓఎస్ మాత్రం పాతదే ఉంటుంది. దీంతో ఎన్నిసార్లు వాల్పేపర్లు, థీమ్‌లు మార్చినా కొత్త అనుభూతి రాదు. అయితే ఫోన్లో పాత ఇంటర్‌ఫేస్‌తోపాటు, యాప్స్, ఫోన్ పనితీరులో మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు లాంచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్లకు ఫోన్ వినియోగంలో పూర్తిస్థాయిలో కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే చాలా మంది యూజర్లు ఫోన్లో బిల్ట్-ఇన్‌గా ఉండే లాంచర్లనే ఉపయోగిస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగంలో కొత్తదనం కోరుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు. ప్లేస్టోర్‌లో ఎన్నో రకాల లాంచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో ది బెస్ట్ ఏడింటి వివరాలపై ఓ లుక్కేద్దామా..
రేషియో లాంచర్ (Ratio Launcher)
డిజిటల్ డిస్ట్రాక్షన్‌ను తగ్గించి ఫోన్‌ను అవసరమైనమేర వినియోగించుకునేందుకు ఈ లాంచర్ సాయపడుతుంది. థీమ్ మొత్తం గ్రే అండ్ బ్లాక్ రంగులో ఉంటుంది. ఇందులో యాప్‌లు అన్ని అల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తాయి. క్రియేటివిటీ, లైఫ్‌స్టైల్, మెసేజింగ్, ప్రొడక్టవిటీ, సోషల్ కేటగిరీలు యాప్‌లను విభజించుకోవచ్చు. ఇందులో ఉచిత వెర్షన్‌తోపాటు, సబ్స్క్రిప్షన్ వెర్షన్ కూడా ఉంది.
నోవా లాంచర్ (Nova Launcher)
ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువ మంది నోవా లాంచర్‌ను ఉపయోగిస్తుంటారు. ఫోన్ కస్టమైజేషన్‌కు బెస్ట్ లాంచర్‌గా దీన్ని అభివర్ణిస్తారు. ఇందులో ఐకాన్ ప్యాక్, డార్క్ మోడ్, థీమ్ చేంజ్, హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్, విడ్జెట్స్ వంటివి సులువుగా చేయొచ్చు.ఇందులో బ్యాకప్ అండ్ రీస్టోర్ ఫీచర్ కూడా ఉంది. దీంతో మనకు నచ్చినట్లుగా ఫోన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఉచిత, సబ్స్క్రిప్షన్ వెర్షన్లలో యూజర్లకు అందుబాటులో ఉంది.
అపెక్స్ లాంచర్ (Apex Launcher)
పేరు తగ్గట్లుగానే అన్ని రకాల ఫీచర్లు, పనితీరు ఇందులో ఉత్తమంగా ఉంటాయి. హోమ్ స్క్రీన్ విడ్జెట్ సైజ్ నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ఇన్ఫినైట్ స్క్రోలింగ్, ట్రాన్సిషన్ యానిమేషన్స్, ఫోల్డర్ స్టైలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి మొబైల్ ఇంటర్ఫేస్కు కొత్త లుక్‌ను ఇస్తాయి. యూజర్లు ఉచిత వెర్షన్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలనుకునే యూజర్లు సబ్స్క్రిప్షన్ వెర్షన్‌ను ప్రయత్నించవచ్చు.
నయాగారా లాంచర్ (Niagara Launcher)
ఇది పూర్తిగా యాడ్-ఫ్రీ లాంచర్. సబ్స్క్రిప్షన్ వెర్షన్‌తోపాటు, ఉచిత వెర్షన్లో కూడా ఎలాంటి ప్రకటనలు ఉండవు. డిజిటల్ డిస్ట్రాక్షన్‌ను తగ్గించుకోవాలనుకునేవారు ఈ లాంచర్‌ను ప్రయత్నించవచ్చు. నోటిఫికేషన్స్, యాప్‌లను ముందు వరుసలో కనిపించేలా ఇందులో ప్రత్యేక ఫీచర్ ఇస్తున్నారు. ఇందులో నోటిఫికేషన్స్ హోమ్ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. ప్రాధ్యానంలేని నోటిఫికేషన్స్‌ను ఆటోమేటిగ్గా ఫిల్టర్ చేయడంతోపాటు, యూజర్‌కు నచ్చిన యాప్స్‌ను ప్రాధాన్యక్రమంలో చూపిస్తుంది.
మైక్రోసాఫ్ట్ లాంచర్ (Microsoft Launcher)
గతంలో యారో లాంచర్ (Arrow Launcher)గా పాపులర్ అయిన ఈ లాంచర్ పేరును మైక్రోసాఫ్ట్ లాంచర్‌గా పేరు మార్చారు. దీని సాయంతో యూజర్లు ఫోన్లోని ఫొటోలను సులువుగా, వేగంగా డెస్క్‌టాప్‌లో చూడొచ్చు. అలానే వెబ్ లింక్‌లను కూడా మొబైల్ నుంచి ఎడ్జ్ బ్రౌజర్ ద్వారా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్లో ఓపెన్ చేసుకునే సదుపాయం ఉంది. యూనివర్సల్ సెర్చ్ బార్, కస్టమ్ థీమ్స్, గెస్చర్ కంట్రోల్స్ వంటివి ఈ లాంచర్ ద్వారా ఫోన్లోనే ఉపయోగించవచ్చు. లాండ్స్కేప్ మోడ్, డార్క్ థీమ్, పర్సనలైజ్డ్ న్యూస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
పోకో లాంచర్ (Poco Launcher)
ఇతర కంపెనీల ఫోన్లలో షావోమి, రెడ్మీ, పొకో ఫోన్లను ఉపయోగించిన అనుభూతి పొందాలనుకునే యూజర్లు ఈ లాంచర్‌ను ప్రయత్నించవచ్చు. ఇందులో యాప్‌లను కమ్యూనికేషన్, ఫొటోగ్రఫీ, ఎంటర్టైన్మెంట్ వంటి కేటగిరీలుగా విభజిస్తుంది. కస్టమైజ్డ్ లేఅవుట్, ట్రాన్సిషన్ ఎఫెక్ట్, ఐకాన్ ప్యాక్ సపోర్ట్, నోటిఫికేషన్ బ్యాడ్జెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇది ఆండ్రాయిడ్ 10 ఆపై వెర్షన్ ఓఎస్‌తో మాత్రమే పనిచేస్తుంది.
యాక్షన్ లాంచర్ (Action Launcher)
పిక్సెల్ ఫోన్ ఉపయోగించాలనుకునేవారు ఈ లాంచర్‌ను వాడి చూడొచ్చు. పిక్సెల్ ఫోన్లో ఉన్నట్లుగానే ఈ లాంచర్ ఇన్స్టాల్ చేసిన ఫోన్లలో అడాప్టివ్ యాప్ బార్, పిల్-షేప్ గూగుల్ సెర్చ్ బార్, ఒరియో-స్టైల్ యాప్ షార్ట్‌కట్స్ ఉంటాయి. కవర్స్, షట్టర్స్ వంటి స్పెషల్ గెస్చర్స్ కూడా ఉన్నాయి.
ఇవే కాకుండా మరికొన్ని లాంచర్లు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌కు పోటీగా వస్తోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న నథింగ్ కంపెనీ కూడా ఒక కొత్త లాంచర్‌ను విడుదల చేసింది. నథింగ్ లాంచర్ పేరుతో వస్తోన్న ఇది ఆండ్రాయిడ్ 11 ఆపై వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు. -
లెక్కల్లో గూగుల్ సాయం
లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది. -
విండోస్‌లోనూ ఏఐ ఎరేజ్
గూగుల్, సామ్సంగ్ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా జనరేటివ్ ఎరేజ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. -
ఛాట్‌జీపీటీతో ఏఐ టూల్స్ జాబితా
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది. -
పెయింట్‌లోనే ఏఐ!
పదాల కూర్పుతో (ప్రాంప్ట్) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్ఇన్ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు -
అంధులకు దారిచూపు
కొత్త భవనాల్లోకి వెళ్తే కళ్లు కనిపించినా తికమక పడతాం. ఇక చూపు కోల్పోయినవారైతే? ఇలాంటివారికి తోడ్పడే రెండు ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్ యాప్‌లను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు -
మెసేజెస్ నుంచే ఫొటో షేర్
ఫోన్లో ఎవరికైనా ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్తాం. వాటిని గుర్తించాక కాంటాక్టులను వెతికి షేర్ చేస్తుంటాం. ఐఫోన్ వాడేవారైతే మరింత త్వరగా మెసేజెస్ ద్వారానే దీన్ని కానియ్యొచ్చు -
యాప్ మాటలు వింటోందా?
ఫోన్లో ఏదో మాట్లాడతాం. అనంతరం ఏదో వెబ్సైట్ చూస్తుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఫోన్లో మాట్లాడే మాటలు యాప్‌లు వింటున్నాయనే అనుమానం వస్తుంటుంది. -
గూగుల్ కొత్త ఏఐ టూల్స్
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏఐ వేదికలు టెక్నాలజీ రంగాన్ని విస్తృతం చేస్తున్నాయి. గూగుల్ తమ ఏఐ వేదిక బార్డ్ పేరును ‘జెమినీ’గా మార్చింది. అంతేకాదు.. ఇటీవల ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్, మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్, టెక్స్ట్ఎఫ్ఎక్స్ అనే కొత్త ఫీచర్లనూ జోడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!