Twitter: ట్వీట్‌లో మీ పేరు మెన్షన్‌ చేశారా? ఇక తల పట్టుకోనక్కర్లేదు!

ఎవరైనా మీ పేరును మెన్షన్‌ చేసినా తొలగించేలా ట్విటర్‌ అద్భుతమైన ఫీచర్‌ తీసుకురానుంది. ‘అన్‌మెన్షన్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టే...

Updated : 11 May 2022 20:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ట్విటర్‌లో ఎవరైనా అనవసరంగా మీ పేరును మెన్షన్‌ చేస్తూ ట్వీట్‌ చేశారా? అరెరే.. అంటూ తల పట్టుకోనక్కర్లేదు. అలా ఎవరైనా మీ పేరును మెన్షన్‌ చేసినా తొలగించేలా ట్విటర్‌ అద్భుతమైన ఫీచర్‌ తీసుకురానుంది. ‘అన్‌మెన్షన్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే కొంతమంది యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.

ట్విటర్‌లో ఏదైనా ట్వీట్‌కు సంబంధించి మీ పేరును మెన్షన్‌ చేస్తే సులువుగా తొలగించేలా ‘అన్‌మెన్షన్‌’ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అధికారిక ‘ట్విటర్‌ సేఫ్టీ ప్రొఫైల్‌’ ఖాతాలో వెల్లడించింది. ఇక ట్వీట్‌లో ఎవరైనా యూజర్ల పేరును మెన్షన్‌ చేస్తే దాన్ని సులువుగా డిలీట్‌ చేసేలా ఈ ఫీచర్‌ పని చేయనుందని పేర్కొంది. అయితే, అన్‌మెన్షన్‌ చేసిన తర్వాత కూడా ఆ ట్వీట్‌లో యూజర్‌ నేమ్‌ మాత్రం అలాగే కనిపిస్తోంది. కానీ, యూజర్‌ నేమ్‌పై క్లిక్‌ చేస్తే ఆయా ప్రొఫైల్‌ను చూపించదు. ఆ ట్వీట్‌కు సంబంధించి ఎవరు కామెంట్‌ చేసినా నోటిఫికేషన్స్‌ పొందలేరు. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా అనవసరపు పోస్టులు, కామెంట్లను కంట్రోల్‌ చేయవచ్చు. దీంతో ట్రోలింగ్‌కు కూడా చెక్‌ పెట్టే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని