Twitter: ఫేస్‌బుక్‌ వార్నింగ్ ఫీచర్‌.. ఇక నుంచి ట్విటర్‌లో!

అశ్లీలత, హింస, సున్నితత్వంతో కూడిన కంటెంట్‌ ఉన్న మీడియా ఫైల్స్‌న పోస్ట్‌ చేసేప్పుడు వాటికి వార్నింగ్ లేబుల్ ఇచ్చే విధంగా ట్విటర్‌ వార్నింగ్ లేబుల్ ఫీచర్‌ను పరిచయం చేసింది.

Published : 28 Feb 2022 23:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత ఏడాది కాలంగా ట్విటర్‌ పరీక్షిస్తున్న కంటెంట్‌ వార్నింగ్ ఫీచర్‌ను ఎట్టకేలకు సాధారణ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ట్విటర్‌లో యూజర్లు పోస్ట్‌ చేసే ఫొటో/వీడియోలలో అశ్లీలత, హింస, సున్నితత్వంతో కూడిన కంటెంట్‌ ఏదైనా ఉంటే దానికి వార్నింగ్ లేబుల్ ఇవ్వొచ్చు. ఇందుకోసం యూజర్‌ ట్వీట్‌కు ఫొటో/వీడియోను యాడ్ చేసిన తర్వాత మూడు చుక్కలపై క్లిక్‌ చేస్తే ఎడిట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే చివర్లో ఫ్లాగ్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. అందులో అశ్లీలత (Nudity), హింస (Violence), సెన్సిటివ్‌ (Sensitive) అనే మూడు కేటగిరీలు కనిపిస్తాయి. వాటిలో సదరు ఫొటో/వీడియో ఏ కేటగిరీ కిందకు వస్తుందనేది సెలెక్ట్ చేసి పోస్ట్‌ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇతర యూజర్లు సదరు పోస్ట్‌ను చూసేప్పుడు మీడియా ఫైల్‌ పైన వార్నింగ్‌ లేబుల్‌ కనిపిస్తుంది.

ఒకవేళ యూజర్‌ సదరు ఫైల్‌ను చూడాలనుకంటే దానిమీద కనిపించే షో బటన్‌పై క్లిక్ చేయాలి. అయితే ట్వీట్‌కు యాడ్‌ చేసే అన్ని మీడియా ఫైల్స్‌ వార్నింగ్ లేబుల్ ఇవ్వలేం. కేవలం ఒక ఫొటో/వీడియోకు మాత్రమే ఇలా చేయడం సాధ్యపడుతుంది. అయితే ఈ వార్నింగ్‌ లేబుల్ ఫీచర్‌ ట్వీట్‌డెక్‌, ఎంబెడ్‌ ట్వీట్‌లలో పనిచేయదని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ఫీచర్‌ ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని