Twitter: ట్విటర్‌ కొత్త ఫీచర్‌.. అక్షరాల పరిమితికి ఇక గుడ్‌బై!

పెద్ద పెద్ద వ్యాసాలు ట్వీట్ చేయాలనుకునే వారి కోసం ట్విటర్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. మరి ఈ ఫీచర్‌ గురించిన విశేషాలేంటో చూద్దాం.

Published : 04 Feb 2022 21:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తక్కువలో ఎక్కువ.. ఇదే ఫార్ములాతో సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీని సొంతం చేసుకుంది ట్విటర్‌. చెప్పాలనుకున్న సమాచారాన్ని సూటిగా, సుత్తి లేకుండా 280 అక్షరాల్లో చెప్పేయాలి. ఒకవేళ దానికి కొనసాగింపుగా ఏదైనా సమాచారం చెప్పాలంటే మరో ట్వీట్ చేయాల్సిందే. తాజా సమాచారం ప్రకారం దీనికి ప్రత్యామ్నాయంగా ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురానుందట. ట్విటర్‌ ఆర్టికల్స్ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇందులో యూజర్స్‌ అక్షరాల పరిమితి లేకుండా పెద్ద పెద్ద వ్యాసాలను ట్వీట్ చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ట్విటర్‌ త్వరలోనే యూజర్లకు అందబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ గురించి యూజర్‌కు తెలిసేలా ట్విటర్‌ మెనూ బార్‌లో ప్రత్యేక ట్యాబ్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఇవేకాకుండా మరికొన్ని కొత్త ఫీచర్స్‌ను ట్విటర్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాటిలో ట్విటర్‌ ఫ్లాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని క్లోజ్‌ ఫ్రెండ్ తరహా ఫీచర్లు ఈ జాబితాలో ఉన్నాయి. క్లోజ్‌ ఫ్రెండ్‌ను పోలిన ఫీచర్‌తో యూజర్ చేసే ట్వీట్లు తమకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే కనిపించేలా చేయొచ్చు. దీంతోపాటు ట్విటర్ కొత్తగా సెర్చ్‌ బార్‌ పేరుతో మరో ఫీచర్‌ను తీసుకురానుంది. ఇప్పటికే ఇతర సామాజిక మాధ్యమాలకు ధీటుగా ట్విటర్‌ కమ్యూనిటీ, లైవ్ చాట్ రూమ్స్‌, సూపర్ ఫాలోస్‌ వంటి ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు