Twitter: రష్యా నిషేధం.. ట్విటర్‌ ‘ఉల్లిపాయ’ ఉపాయం

ట్విటర్‌ వినియోగదారులు కొత్తగా టార్‌ ఆనియన్‌ (Tor Onion) సేవలను ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చని తెలిపింది.

Published : 10 Mar 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ కొత్త సేవలను ప్రారంభించింది. యూజర్ల గోపత్యకు భంగం కలగకుండా సురక్షితమైన సేవలను అందించడానికి డార్క్‌ వెబ్‌ టార్‌ సర్వీసెస్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులు కొత్తగా టార్‌ ఆనియన్‌ (Tor Onion)సేవలను ఉపయోగించి ట్విటర్‌ను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ప్రముఖ సైబర్‌ నిపుణులు అలెక్‌ మఫెట్‌ వెల్లడించారు. 

‘‘ఈ సమయం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ట్విటర్‌లో డార్క్‌ వెబ్‌ టార్ ఆనియన్‌ సర్వీసెస్‌ను తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వినియోగదారులు ట్విటర్‌ సేవలను సులువుగా పొందేందుకు ఈ సర్వీసెస్‌ను ప్రారంభిస్తున్నాం ’’ అని అలెక్ మఫెట్ ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్‌పై జరుపుతోన్న సైనిక చర్యను ఖండిస్తూ.. పలు దిగ్గజ సంస్థలు రష్యాలో వాటి ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, దీనికి రష్యా రివర్స్‌లో ఇదే తరహా చర్యలు చేపట్టి సామాజిక మాధ్యమం ట్విటర్‌ను నిషేధించింది. దీంతో ఆ దేశంలో ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. తిరిగి రష్యాలో ట్విటర్‌ తన సేవలను పునఃప్రారంభించడానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేసింది. ఇందులో భాగంగా ట్విటర్‌ డార్క్‌ వెబ్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. కాగా, టార్‌ ప్రాజెక్టు ఇచ్చిన నివేదిక ప్రకారం.. మార్చిలో 12.77 శాతం మంది యూజర్లు రష్యా నుంచి ట్విటర్‌కు కనెక్ట్‌ అవుతున్నారని వెల్లడించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని