Twitter New Feature: ట్విటర్లో ఫాలోవర్స్‌తో సమస్యా? తొలగించండిలా..

ట్విటర్‌ మరో కొత్త ఫీచర్‌ని యూజర్సకి పరిచయం చేసింది. రిమూవ్‌ దిస్‌ ఫాలోవర్‌ పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్‌తో యూజర్స్ తమ ఫాలోవర్స్‌ని బ్లాక్ చేయకుండా సులువుగా తొలగించవచ్చు. 

Updated : 11 May 2022 16:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ మరో కొత్త ఫీచర్‌ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘రిమూవ్‌ దిస్‌ ఫాలోవర్‌’ పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ ట్విటర్లో తమ ఫాలోవర్స్‌ని బ్లాక్ చేయకుండా తొలగించవచ్చు. గతంలో ట్విటర్లో తమని ఫాలో అయ్యేవారికి తొలగించాలంటే యూజర్స్ వారిని బ్లాక్ చేసేవారు. దీంతో బ్లాక్ చేసినట్లు ట్విటర్‌ వారికి తెలియజేస్తుంది. దాంతో వారు మీ ట్వీట్లు చూసేందుకు తిరిగి మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఉండేది. తాజాగా తీసుకొచ్చిన ‘రిమూవ్‌ దిస్‌ ఫాలోవర్‌’ సాయంతో ఎవరైనా ఫాలోవర్‌ని తొలగించిన తర్వాత మీ వ్యక్తిగత ట్వీట్లను వారు చూడాలంటే మిమ్మల్ని ఫాలో కావాల్సిందే. ఇందుకోసం తప్పనిసరిగా మీ అనుమతిని తీసుకోవాల్సిందే. మీరు అనుమతిస్తేనే వారు మిమ్మల్ని ఫాలో కాగలరు. ఈ కొత్త ఫీచర్‌ వల్ల యూజర్లకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ట్విటర్‌ తెలిపింది. 

ఈ ఫీచర్‌ కోసం యూజర్స్‌ తమ యాప్‌లో లేదా డెస్క్‌టాప్‌ ట్విటర్‌ పేజ్‌లో ఫాలోవర్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఎవరిని తొలగించాలనుకుంటున్న వారి పేరు లేదా ఫొటోపై క్లిక్ చేస్తే వారి ప్రొఫైల్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. అందులో కుడివైపు మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే మీకు ఒక జాబితా కనిపిస్తుంది. అందులో ‘రిమూవ్‌ దిస్‌ ఫాలోవర్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేసి సదరు యూజర్‌ మీ ఫాలోవర్స్‌ జాబితా నుంచి తొలగించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్‌ అందరికీ అప్‌డేట్ అవుతుందని ట్విటర్‌ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని