Twitter: ట్విటర్‌లో షాపింగ్‌.. కొత్త ప్రొడక్ట్ విడుదలకు ముందే అప్‌డేట్‌!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్‌ (Twitter) యూజర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. మరి ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది తెలుసుకుందాం. 

Updated : 09 Jun 2022 21:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్‌ (Twitter) యూజర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ప్రొడక్ట్ డ్రాప్స్‌ (Product Drops) పేరుతో తీసుకురానున్న ఈ ఫీచర్‌తో మార్కెట్లో విడుదలయ్యే కొత్త ఉత్పత్తుల గురించి యూజర్లు తెలుసుకోవచ్చు. 

ఏవైనా సంస్థలు లేదా వ్యాపారి తాము త్వరలో విడుదల చేయబోయే ఉత్పత్తి గురించి ట్వీట్ చేసిన తర్వాత, యూజర్లకు రిమైండ్‌ మీ (Remind Me) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు ప్రొడక్ట్ మార్కెట్లోకి విడుదలయ్యే రోజు విడుదలకు 15 నిమిషాల ముందు లేదా తర్వాత యూజర్‌కు ట్విటర్‌ నుంచి నోఫికేషన్‌ వస్తుంది. యూజర్‌ సదరు నోటిఫికేషన్‌పై క్లిక్ చేసిన వెంటనే ‘షాప్‌ ఆన్‌ వెబ్‌సైట్‌’ (Shop On Website) అనే ఆప్షన్ కనిపిస్తుంది. యూజర్‌ దానిపై క్లిక్ చేసి సదరు ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయొచ్చు. 

అలానే యూజర్‌ రిమైండ్‌ మీ ఆప్షన్‌పై క్లిక్ చేసే ముందు ప్రొడక్ట్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే సదరు వ్యాపార సంస్థలు చేసిన ట్వీట్‌పై క్లిక్ చేస్తే ప్రొడక్ట్ డిటెయిల్స్‌ పేజ్‌ (Products Details Page) ఓపెన్‌ అవుతుందని ట్విటర్‌ తన బ్లాగ్‌లో వెల్లడించింది. అందులో ప్రొడక్ట్ ధర, ఫొటోలు, ఫీచర్లు వంటి వివరాలు ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలోని పలు వ్యాపారసంస్థలతో కలిసి పరీక్షిస్తున్నట్లు ట్విటర్‌ పేర్కొంది. త్వరలోనే అన్ని రీజియన్లలోని యూజర్లకు ఈ తరహా సేవలు అందుబాటులోకి తీసుకురాన్నట్లు ట్విటర్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని