Twitter: జీమెయిల్ లాగిన్‌.. ట్వీట్ డెక్‌ కొత్తగా

సోషల్‌ మీడియా అనగానే ఫేస్‌బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం, కూ..ఇలా ఎన్నో రకాల యాప్‌లున్నాయి. వీటిలో ప్రతి ఖాతాకి ప్రత్యేక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరి. మొబైల్ యాప్‌లో అయితే ఒక్కసారి లాగిన్‌ అయితే సరిపోతుంది. అదే డెస్క్‌టాప్‌ విషయానికొస్తే..ప్రతిసారీ వాటి లాగిన్ వివరాలు గుర్తుపెట్టుకోక తప్పనిసరి...

Published : 21 Jul 2021 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా అనగానే ఫేస్‌బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం, కూ.. ఇలా ఎన్నో రకాల యాప్‌లున్నాయి. వీటిలో ప్రతి ఖాతాకి ప్రత్యేక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరి. మొబైల్ యాప్‌లో అయితే ఒక్కసారి లాగిన్‌ అయితే సరిపోతుంది. అదే డెస్క్‌టాప్‌ విషయానికొస్తే.. ప్రతిసారీ వాటి లాగిన్ వివరాలు గుర్తుపెట్టుకోక తప్పనిసరి. ఈ సమస్యకు పరిష్కారంగా కొంతకాలం క్రితం ఫేస్‌బుక్ యూజర్స్ తమ జీమెయిల్ ఖాతాలతో లాగిన్ కావచ్చని తెలిపింది. తాజాగా ట్విటర్‌ కూడా ఇదే తరహా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ ద్వారా యూజర్స్ తమ జీమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో ట్విటర్‌లో లాగిన్‌ కావచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి బీటా యూజర్స్‌ ట్విటర్‌ బీటా వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షించవచ్చు. త్వరలోనే ఈ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. అలానే ఐఓఎస్‌ యూజర్స్ తమ యాపిల్ ఖాతా వివరాలతో ట్విటర్‌లో లాగిన్ కావచ్చట.   

దీంతోపాటు ట్విటర్ ట్వీట్‌డెక్‌ కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది. యూజర్‌కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ట్వీట్‌ డెక్ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ట్వీట్‌డెక్‌ కొత్త వెర్షన్‌ను అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో ఎంపిక చేసిన యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే బీటా ప్రోగ్రాంకు ఎంపికైన వారికి కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పాత వెర్షన్‌కి భిన్నంగా ట్విటర్ సాధారణ వైబ్‌సైట్ తరహా ఫీచర్స్‌తో ట్వీట్‌ డెక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని