త్వరలో Hey Google అనక్కర్లేదు

గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ను యాక్టివ్‌ చేయడానికి ఇకపై OK Google అనక్కర్లేదట

Published : 27 Apr 2021 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ స్మార్ట్‌ఫోన్‌లో  గూగుల్‌ అసిస్టెంట్‌ వాడే ఉంటారు. ‘హే గూగుల్‌ ’ లేదా ‘ఓకే గూగుల్‌’ అనగానే ‘టింగ్‌...’ అంటూ చిన్న శబ్దంతో మీ వాయిస్‌ అసిస్టెంట్‌ రెడీ అయిపోతాడు. మీరు నెక్స్ట్‌ ఏం అడుగుతారా? అనే ఎదురు చూస్తుంటాడు. ఏదైనా అడిగితే, గూగుల్‌ నుంచి సమాచారం సేకరించి చెప్తాడు. మొబైల్‌కు సంబంధించి ఏదైనా టాస్క్‌ చెబితే జీ హుజూర్‌ అంటూ చేసిపెడతాడు. అయితే ఇదంతా జరిగేది మీరు గూగుల్‌ను ముందుగా చెప్పిన వాయిస్‌ కమాండ్స్‌లో ఏదో ఒకటి చెప్పి తట్టి లేపితేనే. అయితే త్వరలో ఈ వాయిస్‌ కమాండ్స్‌ ఉండవు అని తెలుస్తోంది. అంటే గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ను యాక్టివేట్‌ చేయడానికి హే గూగుల్‌, ఓకే గూగుల్‌ అని అనక్కర్లేదట. 

ఆండ్రాయిడ్‌ 11 బీటా వెర్షన్‌లో గూగుల్‌ అసిస్టెంట్‌కు సంబంధించిన కొన్ని మార్పులు బయటికొచ్చాయి. కొత్త వెర్షన్‌ గూగుల్ అసిస్టెంట్‌లో ‘క్విక్‌ టాస్క్స్‌’ అనే ఫీచర్‌ను గుర్తించారు. అందులో అసిస్టెంట్‌కు ముందుగానే కొన్ని కోడ్‌ నేమ్‌/వాక్యాలు ఇచ్చేయొచ్చు. ఉదాహరణకు.. అసిస్టెంట్‌ ద్వారా ఇంటికి కాల్‌ చేయాలి అంటే ప్రస్తుతం ‘హే గూగుల్‌’ అని పలికి... ఆ తర్వాత ‘కాల్ హోం’ అని చెప్పాలి. క్విక్‌ టాస్క్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక నేరుగా ‘కాల్‌ హోం’ అని చెబితే కాల్‌ మొదలవుతుందట. అలా ఒక్కో టాస్క్‌కి ఒక్కో వాక్యం ముందుగా నమోదు చేసుకోవాలి.  ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు ఇందులో ఇంకొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని