whatsapp: వాట్సాప్‌లో ఇకపై 2GB ఫైల్స్‌.. వారికి పండగే.. ఆప్షన్‌ మీకూ వచ్చిందా?

వాట్సాప్‌లో (Whatsapp) ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సదుపాయం వచ్చేసింది. బంధువులు, స్నేహితులతో 2జీబీ వరకు సైజ్‌ కలిగిన ఫైల్స్‌ను పంపుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Updated : 03 Jun 2022 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌లో (Whatsapp) ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సదుపాయం వచ్చేసింది. బంధువులు, స్నేహితులతో 2జీబీ వరకు సైజ్‌ కలిగిన ఫైల్స్‌ను పంపుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అటు ఆండ్రాయిడ్‌, ఇటు ఐఓఎస్‌ వినియోగదారులకు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఇప్పటికే రోల్‌ ఔట్‌ చేసింది. కొందరు యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రాగా.. మరికొందరికి త్వరలోనే రానుంది.

వాట్సాప్‌లో ప్రస్తుతం 100 ఎంబీకి మించిన ఆడియో, వీడియో ఫైల్స్‌ను పంచుకునే వీల్లేదు. దీంతో చాలా మంది ఆ ఫైల్స్‌ను పంపుకోవడానికి ఇతర మాధ్యమాల మీద ఆధారపడుతున్నారు. దీంతో వినియోగదారుల అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని 2జీబీ వరకు ఫైళ్లను పంచుకునే సదుపాయం తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ గతంలో ప్రకటించింది. కొద్దిరోజులుగా ఈ సదుపాయాన్ని పరీక్షించిన వాట్సాప్‌.. తాజాగా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్‌లో ఈ సదుపాయం మీకు వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే.. 100 ఎంబీకి మించి 2జీబీ లోపల ఉన్న ఫైల్‌ను మీకు నచ్చిన వారితో పంచుకోండి. అయితే, ఫైల్‌ ఏదైనా డాక్యుమెంట్‌ రూపంలో అటాచ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 100 ఎంబీకి మించి ఫైల్‌ విజయవంతంగా పంపినట్లయితే మీకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లే. ఒకవేళ ఫెయిల్‌ అయితే మీరు మరికొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొబైళ్లలో హై రిజల్యూషన్‌ కలిగిన వీడియోలను, ఫొటోలను పంచుకోవడంలో యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సదుపాయం ద్వారా ఎక్కువ నిడివి కలిగిన వీడియోలతో పాటు సినిమాలు కూడా నచ్చిన వారికి పంపించుకోవచ్చు. థాంక్స్‌ టు వాట్సాప్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని