వివో కొత్త సిరీస్‌ వచ్చేసింది.. 

గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో సందడి మొదలెట్టిన వివో ఎక్స్‌60 సిరీస్‌ ఫోన్‌లు.. ఇప్పుడు భారత్‌లోనూ టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు వేరియంట్స్‌తో.. అదిరిపోయే లుక్‌తో ముందుకొచ్చాయి..

Updated : 04 Apr 2021 14:40 IST

ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రో, ఎక్స్‌60 ప్రోప్లస్‌

గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో సందడి మొదలెట్టిన వివో ఎక్స్‌60 సిరీస్‌ ఫోన్‌లు.. ఇప్పుడు భారత్‌లోనూ టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు వేరియంట్స్‌తో.. అదిరిపోయే లుక్‌తో ముందుకొచ్చాయి.. మరి వాటి సంగతులేంటో చూద్దాం..

అంచుల వరకూ తెరే..

ఎక్స్‌60: తెర పరిమాణం 6.56 అంగుళాలు. ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే. పంచ్‌-హోల్‌ కట్‌-అవుట్‌తో సెల్ఫీ కెమెరా కనిపిస్తుంది. రిజల్యూషన్‌ 2376*1080 పిక్సల్‌. స్క్రీన్‌ రీఫ్రెష్‌ రేట్‌ 120హెచ్‌జెడ్‌. స్నాప్‌డ్రాగన్‌ 870 చిప్‌సెట్‌ని వాడారు. ర్యామ్‌ 12జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం 256జీబీ. వెనక మూడు కెమెరాల (48ఎంపీ, 13ఎంపీ, 13ఎంపీ) సెట్‌అప్‌ ఉంది. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32ఎంపీ. బ్యాటరీ సామర్థ్యం 4,300ఎంఏహెచ్‌. 33వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది.
ధర రూ.41,990

కెమెరా సొగసులు

ఎక్స్‌60 ప్రో: ఫోన్‌ కొనే ముందు ఫొటోగ్రఫీ గురించి ఆలోచిస్తున్నారా? అయితే, ప్రో వెర్షన్‌ మీకు ప్రత్యేకం ఎందుకంటే.. దీంట్లోని కెమెరాలకు ‘గింబాల్‌ స్టెబిలైసేషన్‌’ సదుపాయం ఉంది. దీంతో మీరు ఫొటో షూట్‌ చేసినా.. వీడియో చిత్రీకరించిన ఎలాంటి షేకింగ్‌ ఎఫెక్ట్‌ ఉండదు. కెమెరాల సామర్థ్యం విషయానికొస్తే.. వెనక మూడు కెమెరాల (48ఎంపీ, 13ఎంపీ, 13ఎంపీ) సెట్‌అప్‌ ఉంది. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32ఎంపీ. తాకేతెర పరిమాణం 6.56 అంగుళాలు. ర్యామ్‌ 12జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 256జీబీ. బ్యాటరీ సామర్థ్యం 4,200ఎంఏహెచ్‌. 
ధర రూ.49,990

5జీ నెట్‌వర్క్‌తో..

ఎక్స్‌60 ప్రోప్లస్‌: పై రెండు మోడళ్ల తర్వాత వెర్షన్‌ ఇది. 6.56 అంగుళాల తాకేతెరతో ఆకట్టుకుంటోంది. దీంట్లో కొత్తగా వాడిన ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 888. పెరీస్కోప్‌ కెమెరా సెట్‌అప్‌ కూడా ఉంది. 5ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌, 60ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌తో నాణ్యమైన ఫొటోలు తీసుకోవచ్చు. వెనక ఏర్పాటు చేసిన కెమెరా సెట్‌అప్‌ విషయానికొస్తే.. నాలుగు (50ఎంపీ, 48ఎంపీ, 32ఎంపీ, 8ఎంపీ) ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4,200ఎంఏహెచ్‌. 
ధర రూ.69,990 (12జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని