Vivo Y01: బడ్జెట్‌ ధరలో వీవో నుంచి మరో కొత్త ఫోన్‌.. ధర, ప్రత్యేకతలివే!

వీవో కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేసింది. వీవో వై సిరీస్‌లో వై01 మోడల్‌లో బడ్జెట్‌ రేంజ్‌ మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Published : 16 May 2022 20:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వీవో కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేసింది. వీవో వై సిరీస్‌లో వై01 మోడల్‌లో బడ్జెట్‌ రేంజ్‌ మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త ఫోన్‌లో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి?  దాని ధరెంత?

స్పెసిఫికేషన్లు..

పెద్ద స్క్రీన్‌, భారీ బ్యాటరీతో వీవో వై01 మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 11.1 ఆధారిత ఫన్‌ టచ్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌‌తో ఇది పనిచేస్తుంది. 6.51 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ హాలో ఫుల్‌వ్యూ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో పీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందువైపు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ 2జీబీ+32జీబీ, 3జీబీ+32జీబీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వైఫై 2.4హెర్జ్‌, బ్లూటూత్‌ 5.0, మైక్రో యూఎస్‌బీ కనెక్టివిటీ ఉంటుంది. ఇందులో రెండు నానో సిమ్స్‌+ఒక మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ ఉంటుంది. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ రెండు కలర్లలో లభ్యమవుతుంది. 2జీబీ+32జీబీ వేరియంట్‌ ధరను రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని