Vivo Y33T: ‘వై’ సిరీస్‌లో వివో కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లివే

వివో కంపెనీ వై సిరీస్‌లో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ ఫోన్‌ ధర, పీచర్లతోపాటు ఎప్పట్నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయనేది చూద్దాం.

Published : 11 Jan 2022 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివో (Vivo) కంపెనీ వై సిరీస్‌లో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వై33టీ (Vivo Y33T) పేరుతో ఈ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌లో హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా సెన్సర్లు అమర్చినట్లు వివో చెబుతోంది. మరి ఈ ఫోన్‌ ధర, ఇతర ఫీచర్లతోపాటు, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయనేది చూద్దాం. 


ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేటుతో 6.58 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ ఉపయోగించారు. వై33టీలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 


వివో వై33టీ మోడల్‌ను 8 జీబీ ర్యామ్‌/128 జీబీ అంతర్గత స్టోరేజ్‌ వేరియంట్లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 18,990. మిడ్‌ డే డ్రీమ్‌, మిర్రర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, వివో ఇండియా ఈ-స్టోర్‌, పేటీఎం, టాటా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఆన్‌లైన్‌ స్టోర్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్ల నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని