e-SIM: ఐఫోన్ 14లో ఈ-సిమ్ మాత్రమే ఉంటుందా? నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి ఈ-సిమ్ పొందడం ఎలా?
భారత్‌లో విడుదలయ్యే ఐఫోన్ 14 మోడల్స్‌లో ఈ-సిమ్ ఫీచర్ మాత్రమే ఉంటుందా? ఒకవేళ ఫోన్లో ఈ-సిమ్ ఫీచర్ మాత్రమే ఉంటే, దాన్ని ఎలా పొందాలనే సమాచారంపై ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 14 మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో శాటిలైట్ నెట్వర్క్ కనెక్టివిటీ వంటి అడ్వాన్స్డ్ పీచర్లు ఉన్నాయి. యాపిల్ ఈ ఫోన్‌ను ముందుగా అమెరికన్ మార్కెట్లో మాత్రమే విక్రయించనుంది. అంతేకాకుండా ఈ మోడల్స్‌లో సాధారణ సిమ్‌కార్డ్‌కు బదులుగా ఈ-సిమ్ కార్డ్ ఫీచర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. మరి, భారత్‌లో విడుదలయ్యే ఐఫోన్ 14 మోడల్స్‌లో ఈ-సిమ్ ఫీచర్ మాత్రమే ఉంటుందా? సాధారణ సిమ్‌కార్డ్‌కు, ఈ-సిమ్‌కు ఉన్న తేడా ఏంటి? ఒకవేళ ఫోన్లో ఈ-సిమ్ ఫీచర్ మాత్రమే ఉంటే, దాన్ని ఎలా పొందాలి? భారత్‌లో ఏయే మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లు ఈ-సిమ్ సేవలను అందిస్తున్నాయనే సమాచారంపై ఓ లుక్కేద్దాం.
ఐఫోన్ 14లో ఈ-సిమ్ మాత్రమేనా..?
యాపిల్ కంపెనీ 2018లో విడుదల చేసిన ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్లో తొలిసారి ఈ-సిమ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. తర్వాత విడుదలైన ఐఫోన్11, ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్‌లో ఈ-సిమ్‌తోపాటు సాధారణ సిమ్ ఫీచర్ కూడా ఉంది. దాని ప్రకారం ఐఫోన్ 14 సిరీస్‌లో కూడా ఈ-సిమ్‌తో పాటు సాధారణ సిమ్ ఫీచర్ తప్పక ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో ఇప్పటికీ చాలా మంది యూజర్లకు ఈ-సిమ్ వినియోగం గురించి పూర్తి అవగాహన లేదు. దీంతో యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 మోడల్స్‌లో ఈ-సిమ్‌తోపాటు సాధారణ సిమ్ కోసం స్లాట్ ఇస్తుందనేది టెక్ వర్గాల విశ్వాసం.
ఈ-సిమ్ అంటే ఏంటి?
ఈ-సిమ్ (ఎంబెడెడ్-సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్) , ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమ్ కార్డ్‌కు డిజిటల్ వెర్షన్. సాంకేతికత ఆధారంగా ఈ-సిమ్ యూజర్ మొబైల్లో వర్చువల్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ-సిమ్ ఉపయోగించాలనుకునే యూజర్లు ముందుగా తమ నెట్వర్క్ ఆపరేటర్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. తర్వాత నెట్వర్క్ ఆపరేటర్ నుంచి యూజర్ ఫోన్‌కు కోడ్ వస్తుంది. దాని ఆధారంగా యూజర్ ఈ-సిమ్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది.
యూజర్ ఒకే ఫోన్ నంబర్‌పై ఈ-సిమ్, సాధారణ సిమ్ ఉపయోగించలేరు. ఇందులో కూడా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌ను (సిమ్ స్వాప్) మార్చుకునే సదుపాయం ఉంది. దీనికోసం తప్పనిసరిగా నెట్వర్క్ ఆపరేటర్ స్టోర్‌కు వెళ్లవలసిందే. సాధారణ సిమ్‌ను ఒక ఫోన్ నుంచి తీసి మరో ఫోన్లోకి మార్చుకున్నట్లు, ఈ-సిమ్‌ను మార్చుకోవడం సాధ్యంకాదు. ఐఫోన్లో ఈ-సిమ్‌ను ఉపయోగిస్తూనే.. యాపిల్ వాచ్‌లలో కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం భారత్‌లో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ఐడియా సంస్థలు ఈ-సిమ్ సేవలను అందిస్తున్నాయి.
ఈ-సిమ్‌ను ఎలా పొందాలంటే?
జియో నెట్వర్క్
- ఐఫోన్లో ఈ-సిమ్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా ఐఓఎస్ 12.1, ఆపై వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తుండాలి. యూజర్ ఫోన్ నుంచి GETESIM EID and IMEI Number టైప్ చేసి 199 నంబర్‌కి ఎస్సెమ్మెస్ చేయాలి. EID, IMEI నంబర్లు ఫోన్ సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్లో ఉంటాయి.
- తర్వాత నెట్వర్క్ ఆపరేటర్ నుంచి యూజర్ మొబైల్‌కు 19 అంకెల ఈ-సిమ్ నంబర్, ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ వివరాలు మెస్సేజ్ ద్వారా వస్తాయి. మరోసారి యూజర్ మొబైల్ నుంచి SIMCHG 19 అంకెల ఈ-సిమ్ నంబర్ టైప్ చేసి 199 నంబర్‌కి ఎస్సెమ్మెస్స్ చేయాలి.
- రెండు గంటల తర్వాత 183 నంబర్‌కి 1 అని రిప్లై ఇవ్వమని సూచిస్తూ మెస్సేజ్ వస్తుంది. తర్వాత యూజర్ మొబైల్‌కు 19 అంకెల ఈ-సిమ్ నంబర్ చెప్పమని కోరుతూ ఆటోమేటిక్ కాల్ వస్తుంది. ఈ కాల్ పూర్తయిన తర్వాత ఈ-సిమ్ యాక్టివేట్ అయినట్లు ధ్రువీకరణ మెసేజ్ వస్తుంది.
- ఈ-సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత డేటా ప్లాన్లకు సంబంధించి యూజర్ మొబైల్‌కు నోటిఫికేషన్ వస్తుంది. అందులో నచ్చిన ప్లాన్‌ను ఎంపిక చేసుకుని కంటిన్యూపై క్లిక్ చేస్తే, సదరు డేటా ప్లాన్ యూజర్ ఈ-సిమ్‌పై యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ డేటా ప్లాన్‌కు సంబంధించి నోటిఫికేషన్ రాకుంటే, మొబైల్ సెట్టింగ్స్‌లో జియో డేటా ప్లాన్‌లోకి వెళ్లి నచ్చిన ప్లాన్‌ను ఎంపికచేసుకోవచ్చు.
ఎయిర్టెల్ నెట్వర్క్
- యూజర్ మొబైల్ నుంచి eSIM e-Mail id (యూజర్ రిజిస్టర్డ్ మొయిల్ ఐడీ) టైప్ చేసి 121 నంబర్‌కి ఎస్సెమ్మెస్ చేయాలి. తర్వాత ఎయిర్టెల్ నుంచి మెసేజ్ రిప్లై వస్తుంది. తర్వాత యూజర్ మెయిల్ ఐడీకి ఎయిర్టెల్ నుంచి వచ్చిన మెయిల్‌కు 1 అని 60 సెకన్లలోపు రిప్లై ఇవ్వాలి.
- యూజర్ ఈ-సిమ్ రిక్వెస్ట్‌ను ధ్రువీకరిస్తూ ఎయిర్టెల్ ప్రతినిధులు యూజర్ మొబైల్‌కు ఫోన్ చేస్తారు. వాళ్లు అడిగిన వివరాలు చెప్పిన తర్వాత, యూజర్ మెయిల్ ఐడీకీ క్యూఆర్ కోడ్ పంపుతారు.
- ఎయిర్టెల్ పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే ముందు యూజర్ మొబైల్‌ను వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేయాలి. తర్వాత మొబైల్ నెట్‌వర్క్‌లో అడ్వాన్స్డ్ ఆప్షన్స్‌లోకి వెళ్లి యాడ్ క్యారియర్ సెక్షన్ ఓపెన్ చేస్తే స్కాన్ ఆప్షన్ కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డౌన్లోడ్పై క్లిక్ చేస్తే ఈ-సిమ్ యాక్టివేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత యూజర్ మొబైల్‌కు ఈ-సిమ్ యాక్టివేట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM