Published : 16 Jun 2022 02:20 IST
5G in India: దేశంలోకి 5G వచ్చేస్తోంది... ముఖ్యమైన10 అంశాలు ఇవే!
5G సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై ఆఖరులో స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 5G విషయంలో యూజర్లలో ఉన్న సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలిచ్చే ప్రయత్నమే ఇది. ఇందులో మీ ప్రశ్న/ సందేహం ఉందేమో చూసుకోండి. పనిలోపనిగా 5G ఉపయోగాల గురించి కూడా చదివేయండి!
- 5G అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్‌గా, ఈజీగా సమాధానం చెప్పాలంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ కంటే వేగంగా, తక్కువ ల్యాగ్‌తో ఇంటర్నెట్ అందించే సర్వీసు అని చెప్పొచ్చు.
- 5G ఫ్రీక్వెన్సీ రేంజి గరిష్ఠంగా 24 GHz నుంచి 54 GHz మధ్య ఉంటుందని సమాచారం. 4జీ సంగతి చూస్తే ఈ ఫ్రీక్వెన్సీ రేంజి 600 MHz నుంచి 900 MHz వరకు ఉంది.
- 5Gలో లోబ్యాండ్, మిడ్ బ్యాండ్, హై బ్యాండ్ మిల్లీమీటర్ అని మూడు రకాల బ్యాండ్స్ ఉంటాయి. మన దేశంలో మిడ్ బ్యాండ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 4జీ కంటే దీని వేగం పది రెట్లు ఎక్కువ ఉండొచ్చట.
- 4జీలో డౌన్‌లోడ్ వేగం 150 ఎంబీపీఎస్ వరకు ఉంటే.. 5G వేగం 10 జీబీపీఎస్ వరకు ఉంటుందట. సుమారు 3 గంటల హెచ్‌డీ క్వాలిటీ సినిమాను 5Gలో సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు.
- 5G ప్లాన్స్ విషయంలో ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. 4జీ ప్లాన్స్ కంటే ఎక్కువ ఉంటాయి అని మాత్రం చెప్పొచ్చు. అయితే 4జీ ప్లాన్స్, 5G ప్లాన్స్ ధరల్లో పెద్దగా మార్పు ఉండబోదని ఓ టెలికాం కంపెనీ అప్పట్లో పేర్కొంది.
- జులైలో 5G వేలం నిర్వహిస్తున్నారు. ఆ లెక్కన 2023 ప్రథమార్ధంలో దేశంలో 5G సేవలు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వేలం ప్రక్రియ పూర్తయిన రెండు నుంచి నాలుగు నెలల్లో సేవలు ప్రారంభమవుతాయని ఓ సర్వీసు ప్రొవైడర్ ప్రతినిధి గతంలో చెప్పారు.
- 5G కోసం కొత్తగా టవర్స్ ఏర్పాటు చేయనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న టవర్స్ ద్వారానే 5G సిగ్నల్స్‌ను అందించనున్నారు.
- 5G సర్వీసులు కేవలం మొబైల్‌కి మాత్రమే అనుకోనక్కర్లేదు. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ తదితర రంగాల్లో విరివిగా వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- 5G సేవలను ఆటోమేటడ్ గైడెడ్ వెహికల్స్, రోబోలు, మెషీన్లలోనూ వినియోగించబోతున్నారు. వీటితోపాటు వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీ సాంకేతికతల్లోనూ 5Gని వినియోగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
- 5G వేగం ఎక్కువగా ఉండటం వల్ల భద్రత తక్కువగా ఉంటుందనే అసత్య ప్రచారం ఒకటి వాట్సాప్ యూనివర్శిటీల్లో చక్కర్లు కొడుతోంది. అయితే 4జీ కంటే 5Gలో భద్రత ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Smoking In Plane: విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్..!
-
General News
CM Jagan: పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యా వ్యవస్థలో మార్పులు: సీఎం జగన్
-
Movies News
Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
-
Politics News
EC: కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా ప్రచారానికి ఈసీ బ్రేక్!
-
World News
Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
-
India News
Anubrata Mondal: 30 కార్ల కాన్వాయ్‌తో వచ్చి.. తృణమూల్ ‘బాహుబలి’ని అరెస్టు చేసి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి