వాట్సాప్ ప్రైవసీ పాలసీ.. ఏంటా కథ..?
యాప్‌లను వాడాలంటే ప్రైవసీ ఎంతో కీలకం. యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సదరు యాప్ నిర్వాహకులపై...
ఇంటర్నెట్‌డెస్క్: యాప్‌లను వాడాలంటే ప్రైవసీ ఎంతో కీలకం. యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సదరు యాప్ నిర్వాహకులపై ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భరోసా ఇస్తామని కేంద్రానికి వాట్సాప్ స్పష్టం చేసింది. అయినప్పటికీ చాలామందిలో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అసలేంటి ఈ పాలసీ, ఎప్పటిలోగా అంగీకరించాల్సి ఉంది.. అంగీకరించకపోతే ఏం జరుగుతోంది.. వివాదం ఎందుకు వచ్చిందో ఓ సారి తెలుసుకుందాం..
అసలు ఏంటీ పాలసీ..?
గత నెలలో వాట్సాప్ తన యూజర్లకు ప్రైవసీ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇచ్చింది. తమ యూజర్ల భద్రతకు, ప్రైవసీకి, సమాచార గోప్యత పాటించడమే తమ లక్ష్యమని వాట్సాప్ చెప్పింది. కొంతమంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకుంటోందని ఆందోళనలు రేగాయి. వాటన్నింటినీ అప్పట్లో వాట్సాప్ కొట్టిపడేసింది. కొందరి యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం జరిగిందని వాట్సాప్ ఎట్టకేలకు అంగీకరించింది. అంతేకాకుండా యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేసింది. ఎక్కువగా బిజినెస్ యూజర్ల కోసమే కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. వ్యక్తిగతంగా చేసుకునే మెసేజ్‌లు, కాల్స్‌కు సంబంధించిన వివరాలను ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్‌డ్ సాంకేతికతను వినియోగించడంతో వాట్సాప్ చూడలేదని తెలిపింది.
మరి ఎందుకీ చర్చ...?
ఓ పక్క యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు ఆటంకాలు ఉండవని వాట్సాప్ చెబుతుండగా.. తమ సమాచారాన్ని, ఐపీ అడ్రస్‌లను ఇతర సోర్స్‌లకు ఇస్తున్నారని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 8 నుంచే ప్రైవసీ పాలసీని అమల్లోకి తీసుకురావాలని వాట్సాప్ భావించినా.. దానిని మే 15వ తేదీకి వాయిదా వేసింది. డేటా షేరింగ్‌కు సంబంధించినదే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించే అంశం. అయితే దీనిపై వాట్సాప్ స్పష్టమైన వివరణ ఇచ్చినట్లుగానే ఉంది. యూజర్ల భద్రతకు సంబంధించి విఘాతం కలగకుండా ఎవరి అనుమతి లేకుండా ఫేస్‌బుక్‌కు డేటాను షేర్ చేయమని వాట్సాప్ వెల్లడించింది. కేవలం యూజర్ అనుమతి ఉంటేనే షేర్ చేసేందుకు.. అది కూడా వాట్సాప్ యూజర్ ఎంపిక మీదే ఆధారపడి ఉంటుందని తెలిపింది.
గడువు ఎప్పటి వరకు.. ఎలా చెక్ చేసుకోవాలి?
ఫిబ్రవరి నుంచే కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని మే నెలకు పెంచింది. అప్డేటెడ్ ప్రైవసీ పాలసీకి అనుమతి తెలిపేందుకు మే 15వ తేదీని తుది గడువుగా విధించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే ఏమవుతుంది..? వాట్సాప్ మొదట తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం.. అంగీకారం ఇవ్వకపోతే వాట్సాప్ ఖాతాను వినియోగించే అవకాశం కోల్పోతారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత నేపథ్యంలో కొత్తగా అప్డేట్ చేసిన ప్రైవసీ పాలసీలో దానిని తొలగించింది. అప్డేటెడ్ ప్రైవసీ పాలసీని తెలుసుకోవడం ఎలాగో గత వారం వాట్సాప్ వివరణ ఇచ్చింది. వాట్సాప్ అప్డేట్కు సంబంధించి నోటిఫికేషన్‌ను త్వరలో ఇస్తామని వెల్లడించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ లేదా టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ (టీవోఎస్)కు సంబంధించి ఇప్పటికే భారత్‌లో కొంతమంది యూజర్లకు అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. మిగతావారికి కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ తెలిపింది. అప్డేటెడ్ చేసిన ప్రైవసీ పాలసీని యూజర్లకు తెలియజెప్పడమే తమ ప్రధాన ఉద్దేశమని వాట్సాప్ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
-
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
-
ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్.. అమిత్ షా ఏమన్నారంటే!
-
సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది.. గీత దాటితే వేటే: ఈసీ
-
వైకాపా మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం.. అభ్యర్థుల్ని అప్రమత్తం చేసిన ఎన్డీయే
-
ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి.. బాధను దిగమింగి.. ‘సివిల్స్’లో రెండో ర్యాంకు