Apple Event: యాపిల్‌ ఈవెంట్‌.. కొత్తగా ఏం రావొచ్చంటే..?

యాపిల్‌ ఫస్ట్‌ బిగ్‌ ఈవెంట్‌-2022కు రంగం సిద్ధమైంది. వర్చువల్‌ పద్ధతిలో మార్చి 8 తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు యాపిల్ ప్రకటించింది.

Published : 07 Mar 2022 01:23 IST

ఎప్పటిలాగే ఈ ఏడాదికి సంబంధించి యాపిల్‌ ఫస్ట్‌ బిగ్‌ ఈవెంట్‌-2022కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తన కొత్త మోడళ్లను కంపెనీ ఈ వేడుకలో లాంచ్‌ చేయనుంది. వర్చువల్‌ పద్ధతిలో మార్చి 8 తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు యాపిల్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈసారి యాపిల్‌ నుంచి రానున్న ఆ కొత్త ఉత్పత్తులెంటో ఓ లుక్కేద్దాం..

ఇది మోడల్‌ కాదు.. స్పెషల్ ఎడిషన్‌

ఐఫోన్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూడో జనరేషన్‌ ‘ఐఫోన్‌ ఎస్‌ఈ 3 (iPhone SE 3)’ ఈ వర్చువల్‌ వేడుకలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఎస్‌ఈ 3ను యాపిల్‌ ఈ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఇది మోడల్ కాదు.. ఎస్‌ఈ అంటే స్పెషల్ ఎడిషన్‌. యాపిల్ కంపెనీ ఎస్‌ఈ మోడల్‌ను తొలిసారిగా 2016లో విడుదల చేసింది. యాపిల్ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు భిన్నంగా అందుబాటు ధరలో ఒక ఫోన్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్‌ఈను పరిచయం చేసింది. అయితే, ఎస్‌ఈ 3ను 5జీకి అనువుగా A15 బయోనిక్‌ చిప్‌సెట్‌తో తీసుకురానున్నట్లు సమాచారం. 

యాపిల్‌ ఐఫోన్ ఎస్‌3.. ఐదు ఆసక్తికర విశేషాలు!

* ఇక మిడ్‌-రేంజ్‌లో ‘ఐప్యాడ్ ఎయిర్ 5 (iPad Air 5)’ను ఈ వేడుకలో యాపిల్ ఆవిష్కరించనుంది. సరికొత్త ఫీచర్లు, 5జీ కనెక్టివిటీ, A15 బయోనిక్ చిప్‌సెట్‌లో దీనిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐప్యాడ్ ఎయిర్ 5ను కూడా మెరుగైన వీడియో కాల్స్‌ కోసం కొత్త ఫ్రంట్ ఫేసింగ్ 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో తీసుకురాన్నుట్లు సమాచారం.

* అలాగే ఈ కార్యక్రమంలో కొత్త మ్యాక్‌బుక్‌ల సందడి కూడా ఉండనుంది. మొత్తం మరో మూడు మ్యాక్‌బుక్‌లను యాపిల్‌ పరిచయం చేయనుంది. ఇందులో ఒకటి మ్యాక్‌బుక్‌ ప్రో కాగా, మిగిలిన వాటి గురించి కచ్చితమైన సమాచారం లేదు. శక్తిమంతమైన M2 చిప్‌సెట్‌లతో వీటిని తీసుకురానున్నారు.

* మరోవైపు సాఫ్ట్‌వేర్‌ విషయానికొస్తే..  iOS 15.4 రూపంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే బీటాలో కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు దీనిని యాపిల్‌ ఫస్ట్‌ బిగ్‌ ఈవెంట్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది. కొత్త మోడల్స్‌ విడుదల చేస్తున్న దృష్ట్యా వాటినీ iOS 15.4తో తీసుకోరావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే, iOS 15.4 అప్‌డేట్‌ ద్వారా మీరు మాస్కు ధరించి కూడా ఫేస్‌ఐడీతో ఫోన్‌ అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకు యాపిల్‌ వాచ్‌తో పనిలేదు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని