WhatsApp: వెబ్‌ వెర్షన్‌లోనూ వాట్సాప్‌ టూ-స్టెప్ వెరిఫికేషన్‌!

వాట్సాప్‌ త్వరలో డెస్క్‌టాప్‌ యాప్, వెబ్‌ వెర్షన్‌లోనూ టూ స్టెప్ వెరిఫికేషన్ తీసుకురానుంది. ఈ మేరకు రాబోయే అప్‌డేట్‌లో..

Published : 24 Jan 2022 21:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేంజర్‌ వాట్సాప్‌ త్వరలో డెస్క్‌టాప్‌ యాప్, వెబ్‌ వెర్షన్‌లోనూ రెండు దశల ధ్రువీకరణను (2 Step Verification or 2SV - టూ స్టెప్ వెరిఫికేషన్) తీసుకురానుంది. ఈ మేరకు రాబోయే అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ తీసుకురానున్నట్లు సమాచారం. తద్వారా డెస్క్‌టాప్‌ యూజర్లు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఎనేబుల్‌, డిసేబుల్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాట్సాప్‌ పిన్‌ మర్చిపోతే ఈ-మెయిల్‌ ద్వారా రీసెట్‌ చేసుకోవచ్చు. కాగా, ఇప్పటికే మొబైల్ యాప్ వెర్షన్‌లో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ అందుబాటులో ఉన్న సంగతి విదితమే. 

మరోవైపు సైబర్‌ నేరగాళ్ల నుంచి యూజర్ల ఖాతాలకు రక్షణ కల్పించడానికి గూగుల్ కూడా ఈ మధ్యే టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్ ఫోన్ లేదా ఈ-మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని టైప్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుందని గూగుల్‌ తెలిపింది.

ఇదిలా ఉంటే.. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌ మొబైల్‌కు వాట్సాప్‌ చాట్‌ బదిలీ చేసేలా మరో కొత్త ఫీచర్‌పై మెటా పనిచేస్తోంది. కేబుల్‌ లేదా వైఫై కనెక్షన్‌ను ఉపయోగించి చాట్‌ బదిలీ చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. పలువురు బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి ఉండగా, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని