WhatsApp: ఒక్క క్లిక్‌తో డేటా బదిలీ.. స్టేటస్ ట్యాబ్ మారుతోంది!
వాట్సాప్ యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఛాట్ హిస్టరీ బదిలీ ఫీచర్‌ను ఎట్టకేలకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్స్ ఐఓఎస్ డివైజ్‌లోని ఛాట్ డేటాను సులభంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లోకి బదిలీ చేసుకోగలరు. గతంలో ఛాట్ డేటాను ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కి మార్చుకోవాలనుకుంటే...
ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్ యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఛాట్ హిస్టరీ బదిలీ ఫీచర్‌ను ఎట్టకేలకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్స్ ఐఓఎస్ డివైజ్‌లోని ఛాట్ డేటాను సులభంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లోకి బదిలీ చేసుకోగలరు. గతంలో ఛాట్ డేటాను ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కి మార్చుకోవాలనుకుంటే థర్డ్‌పార్టీ యాప్‌లను ఉపయోగించడం లేదా క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకుని కొత్త డివైజ్‌లోకి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసేవారు. దీనివల్ల కొన్నిసార్లు డేటా లీక్ లేదా డిలీట్ అయ్యేది. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ఛాట్ హిస్టరీ ట్రాన్స్ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకమీదట యూజర్స్ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి సులువుగా ఛాట్ డేటాను బదిలీ చేసుకోవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్ గురించిన వివరాలను శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ కార్యక్రమంలో ప్రకటించింది. ప్రస్తుతం కొద్ది మంది యూజర్స్కే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్స్‌కి అందరికీ అందుబాటులోకి రానుంది.
‘‘యూజర్స్ ఇకమీదట వాట్సాప్‌లోని ఛాట్ హిస్టరీ, వాయిస్ నోట్, ఫొటోస్, వీడియోలని వేర్వేరు ఓఎస్‌లతో పనిచేసే ఫోన్లలోకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇది ఎంతో సురక్షితమైన పద్ధతి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను ఈ ఫీచర్ సపోర్టు చేస్తుంది. ముందుగా ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే ఐఓఎస్ యూజర్స్‌కి పరిచయం చేస్తాం. ఈ ఫీచర్ కోసం ఎంతో కాలంగా యూజర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఎట్టకేలకు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం కంపెనీలతో కలిసి దీన్ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ వాట్సాప్ యూజర్ స్టేటస్ చూడటానికి ప్రత్యేకంగా స్టేటస్ అనే ట్యాబ్ ఉండేది. త్వరలో ఆ ట్యాబ్‌ని తొలగించనున్నారు. యూజర్ స్టేటస్ చూడాలంటే ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేస్తే వ్యూ ప్రొఫైల్ ఫొటో, వ్యూ స్టేటస్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో స్టేటస్‌పై క్లిక్ చేస్తే సరిపోతుందట. ప్రస్తుతం పరీక్షల దశలో ఈ ఫీచర్ కొద్ది మంది బీటా యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్‌కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM