
WhatsApp: రెండు లక్షల భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధం.. ఎందుకంటే?
ఇంటర్నెట్‌డెస్క్: యూజర్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఏడాది అక్టోబరులో సుమారు రెండు లక్షలకుపైగా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, ఇతర యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదులు, వినతులు ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా హానికరమైన చర్యలకు పాల్పడుతున్న వారి ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది.
‘‘ఒక ఖాతాపై చర్యలు తీసుకునే ముందు మేం మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. మొదటిది ఖాతా రిజిస్టేషన్ చేసేప్పుడు, మెసేజింగ్ చేసేప్పుడు ఎలా ఉంది. రెండోది ఎవరైనా యూజర్ సదరు ఖాతా గురించి బ్లాక్ రిపోర్ట్ పంపడం. మూడోది ఖాతా గురించి మరో యూజర్ రిపోర్ట్ చేయడం. ఈ మూడు అంశాలలో ద్వారా అందిన ఫిర్యాదులను వాట్సాప్‌లోని అనలటిక్స్ బృందం పరిశీలించి సదరు ఖాతాలపై చర్యలు తీసుకుంటుంది’’ అని వాట్సాప్ తెలిపింది. అక్టోబరు నెలలోనే 18 ఖాతాలకు సంబంధించి 500 వినతులు వచ్చినట్లు వెల్లడించింది. వీటిలో 146 రిపోర్టులు, 248 బ్యాన్ వినతులు, 53 ప్రొడక్ట్ రిపోర్టులు, 11 సేఫ్టీ రిపోర్టులు, 42 ఇతరత్రా వినతులు ఉన్నట్లు పేర్కొంది. అలానే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఎంతో పటిష్టమైందని వాట్సాప్ మరోసారి స్పష్టం చేసింది. ఈ ఫీచర్ ద్వారా సమాచార మార్పిడి జరుగుతున్నప్పుడు దాన్ని పంపినవారు, రిసీవ్ చేసుకున్నవారు మినహా ఇతరులెవరు చూడలేరని వాట్సాప్ తెలిపింది.
గూగుల్ కూడా యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా అక్టోబరులో సుమారు 48,594 వివాదాస్పద కంటెంట్లను తొలగించినట్లు వెల్లడించింది. అలానే మరో 3,84,509 పోస్టులను ఆటోమేటెడ్ డిటెక్షన్ విధానం ద్వారా గూగుల్ నుంచి తీసేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. సెప్టెంబరులో 29, 842 ఫిర్యాదులు అందగా, వాటి ఆధారంగా మరో 76, 967 పోస్టులను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ నుంచి తొలగించిన వాటిలో ఎక్కువగా కాపీ రైట్‌కు సంబంధించిన కంటెంట్ ఉందని గూగుల్ వెల్లడించింది.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.