WhatsApp Beta: కొత్త అప్‌డేట్‌తో..యూజర్స్‌కి చిక్కులు

యూజర్స్‌కి మెరుగైన సేవలందించేందుకు యాప్‌లు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంటాయి. వీటిలో కొన్ని ఫీచర్లని పరీక్షించేందుకు ఎంపిక చేసిన యూజర్స్‌కి ముందస్తుగా అందుబాటులోకి తీసుకొస్తాయి. వారినే బీటా యూజర్స్ అంటారు. బీటా యూజర్స్‌ కొత్త ఫీచర్స్‌ని పరీక్షించిన తర్వాత ఏవైనా లోపాలుంటే కంపెనీలకు తెలియజేస్తారు...

Updated : 12 Aug 2022 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్స్‌కి మెరుగైన సేవలందించేందుకు యాప్‌లు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంటాయి. వీటిలో కొన్ని ఫీచర్లని పరీక్షించేందుకు ఎంపిక చేసిన యూజర్స్‌కి ముందస్తుగా అందుబాటులోకి తీసుకొస్తాయి. వారినే బీటా యూజర్స్ అంటారు. బీటా యూజర్స్‌ కొత్త ఫీచర్స్‌ని పరీక్షించిన తర్వాత ఏవైనా లోపాలుంటే కంపెనీలకు తెలియజేస్తారు. ఆయా కంపెనీలు లోపాలను సరిచేసి పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తాయి. తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన ఓ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వాట్సాప్‌  2.21.16.9 బీటా వెర్షన్ అప్‌డేట్ చేసిన యూజర్స్ వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాల నుంచి పాత ఛాట్‌లు డిలీట్ అయిపోతున్నట్లు తెలిపారు. పాత ఛాట్‌లకు సంబంధించి కేవలం 25 మెసేజ్‌లు మాత్రమే కనిపిస్తున్నాయని, వాటికంటే ముందు వచ్చిన మెసేజ్‌లు వాటంతటవే డిలీట్ అయిపోతున్నాయని..ఈ బగ్‌ సమస్యను వాట్సాప్ వెంటనే పరిష్కరించాలని కోరుతూ ట్విటర్‌, రెడిట్‌ వంటి సామాజిక మాథ్యమాల్లో పోస్టులు చేశారు.

‘‘ వాట్సాప్‌ 2.21.16.9 బీటా వెర్షన్‌ అప్‌డేట్ చేసిన ఛాట్ పేజీలో పాత మెసేజ్‌లు కనిపించడంలేదు. పాత మెసేజ్‌లు లోడ్ అవుతున్నట్లు కనిపిస్తున్నా..అవి రావడంలేదు. సెర్చ్‌ బార్‌లో కీ వర్డ్ ద్వారా సెర్చ్ చేసిన అవి కనిపించడంలేదు’’ అని రెడిట్‌లో పోస్ట్ చేశారు. ఈ సమస్య మొబైల్ వెర్షన్‌తోపాటు వాట్సాప్ వెబ్‌లో కూడా వస్తున్నట్లు కొంతమంది యూజర్స్‌ తెలిపారు. అయితే తాత్కాలికంగా యూజర్స్ వాట్సాప్‌ యాప్‌ని రీ-ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా ఈ సమస్య అలానే ఉందని వెల్లడించారు. దీనిపై వాట్సాప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇటీవలే వాట్సాప్ వ్యూ వన్స్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కి కొత్త ఎమోజీలను పరిచయం చేసింది. ఎమోజీ 13.1 పేరుతో తీసుకొస్తున్న కొత్త అప్‌డేట్‌లో సుమారు 217కు పైగా కొత్త ఎమోజీ సింబల్స్‌ను తీసుకొచ్చింది. అంతకముందు మల్టీడివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ను బీటా వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇవేకాకుండా ఛాట్ ఆర్కైవ్‌, ఛాట్ క్లౌడ్ బ్యాకప్‌ వంటి కొత్త ఫీచర్లను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని