Whatsapp: ఫార్వర్డ్‌ మెసేజ్‌లపై వాట్సాప్‌ సంచలన నిర్ణయం..?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రూపులో ఫార్వర్డ్‌ మెసేజ్‌లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్‌ చేసుకునేలా  కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

Updated : 12 Aug 2022 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇకపై ఫార్వర్డ్‌ మెసేజ్‌లను ఒకసారి ఒక గ్రూప్‌/ వ్యక్తికి మాత్రమే ఫార్వర్డ్‌ చేయగలిగేలా సాంకేతికంగా మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వాబీటాఇన్ఫో విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 22.2.7.2, ఐఫోన్‌ 22.7.0.76 వెర్షన్‌లో ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.


వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు/వ్యక్తులకు త్వరలో ఫార్వర్డ్‌ చేయడం కుదరదు. ఒకవేళ ఫార్వర్డ్ చేయాలనుకుంటే తిరిగి మెసేజ్‌ని ఎంచుకుని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కాగా.. సింగిల్‌ గ్రూప్‌ ఫార్వర్డ్‌ లిమిటేషన్‌ ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. అయితే, ఈ నిబంధనలను మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఇంకొన్ని రోజుల్లో అన్ని స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు/ వ్యక్తులకు ఫార్వర్డ్‌ చేసే వీలు ఉండకపోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకసారి ఐదుగురికి/ ఐదు గ్రూపులకు ఫార్వర్డ్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని