Published : 21 Jul 2022 17:22 IST

WhatsApp: ఆండ్రాయిడ్ టు ఐఫోన్‌.. సులువుగా వాట్సాప్ డేటా బదిలీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్ (Android) ఫోన్‌ నుంచి ఐఫోన్‌ (iPhone)కి మారుతున్నామంటే అందులోని డేటా మొత్తం బదిలీ చేయాల్సిందే. ఏ చిన్న తప్పు చేసిన డేటా డిలీట్ అయిపోతుంది. ముఖ్యంగా వాట్సాప్‌ (WhatsApp)లో డేటా బదిలీ చేయాలంటే మాత్రం గూగుల్ డ్రైవ్‌ (Google Drive) వంటి వాటిలో బ్యాకప్‌ చేసుకోవాల్సిందే. ఇకపై వాటి అవసరం లేకుండా యాపిల్‌ (Apple) కంపెనీ మూవ్‌ టు ఐఓఎస్‌ (Move to iOS) అనే యాప్‌ను ప్లేస్టోర్‌లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌కు యూజర్లు సులువుగా డేటా బదిలీ చేయొచ్చు. యూజర్‌ ఖాతా సమాచారంతో పాటు ప్రొఫైల్‌ ఫొటో, వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్‌ చాట్‌లు, చాట్ హిస్టరీ, మీడియా ఫైల్స్‌ను సురక్షితంగా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు బదిలీ చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఈ యాప్‌ను ఉపయోగించేందుకు వాట్సాప్‌ కొన్ని సూచనలు చేసింది. దాంతోపాటు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ డేటా ఎలా బదిలీ చేయాలో చూద్దాం...

  • ఐఫోన్‌లో ఐఓఎస్‌ 15.5 ఆపై వెర్షన్‌, ఆండ్రాయిడ్‌ 5 ఓఎస్‌తోపాటు తర్వాతి వెర్షన్‌ ఓఎస్‌లను మాత్రమే ఈ యాప్‌ సపోర్ట్ చేస్తుంది. 
  • ఐఫోన్‌లో ఐఓఎస్‌ 2.22.10.70 వెర్షన్‌, ఆండ్రాయిడ్‌లో 2.22.7.74 వెర్షన్‌ వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసుండాలి. 
  • రెండు ఫోన్లు ఒకే వైఫై నెట్‌వర్క్‌కు లేదా ఐఫోన్‌ హాట్‌స్పాట్‌ నెట్‌వర్క్‌కు ఆండ్రాయిడ్ డివైజ్‌ను కనెక్ట్ చేయాలి. 
  • ఈ ప్రక్రియ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో మూవ్‌ టు ఐఓఎస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి యాప్‌ను ఓపెన్ చేస్తే ఐఫోన్‌ స్క్రీన్‌ మీద కోడ్‌ కనిపిస్తుంది. దాన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో టైప్‌ చేయాలి. 
  • తర్వాత స్క్రీన్‌ మీద కనిపిస్తున్న సూచనలను ఫాలో అవుతూ ట్రాన్స్‌ఫర్‌ డేటా (Transfer Data) ఆప్షన్‌లో వాట్సాప్‌ను సెలక్ట్ చేయాలి. 
  • వాట్సాప్‌ యాప్‌లో డేటా ప్రిపేరింగ్ ఫర్‌ ట్రాన్స్‌ఫర్‌ (Data Preparing for Transfer) అని కనిపిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత  నెక్ట్స్‌ బటన్‌పై క్లిక్ చేస్తే తిరిగి మూవ్‌ టు ఐఓఎస్‌ యాప్‌కు రీడైరెక్ట్ చేస్తుంది. 
  • యాప్‌లో కంటిన్యూ డేటా ట్రాన్స్‌ఫర్‌ (Continue Data Transfer) క్లిక్‌ చేసిన తర్వాత స్క్రీన్‌ మీద ప్రక్రియ పూర్తయినట్లు మెసేజ్ కనిపిస్తుంది. 
  • ఐఫోన్‌లో వాట్సాప్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసి ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ చేసిన తర్వాత స్టార్ట్ బటన్‌పై క్లిక్ చేస్తే ప్రాసెస్‌ మొత్తం పూర్తయి మీ వాట్సాప్ డేటా మొత్తం అప్‌డేట్ అవుతుంది. 
  • ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్‌ అన్‌ఇన్‌స్టాల్ చేసే వరకు మీ డేటా అందులో కూడా ఉంటుంది. 
Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts